ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఆలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి - అధికారులకు సీఎం చంద్రబాబు సూచన - CM INTERACTS WITH MINISTERS

కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో పాలనా అంశాలపై సీఎం చర్చ - రాష్ట్రంలో ప్రధాని పర్యటన విజయవంతానికి మంత్రులతో కేబినెట్‌ సబ్ కమిటీకి నిర్ణయం

CM_Interacts_with_Ministers
CM_Interacts_with_Ministers (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 3:47 PM IST

Updated : Jan 2, 2025, 6:59 PM IST

CM Chandrababu Interacts with Ministers:కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలోపే 'తల్లికి వందనం' సొమ్ములు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల చేయగానే రాష్ట్ర వాటాను జోడించి 'అన్నదాత సుఖీభవ' సాయం అందించాలని నిర్దేశించారు. గత ప్రభుత్వ పాపాలతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలన్నింటినీ ఈ ఏడాది అమల్లోకి తెస్తామని వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు: కొత్త ఏడాదిలో ఆర్థిక వెసులుబాటును బట్టి 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ', 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం', 'ఆడబిడ్డ నిధి' పథకాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, దీపం పథకం అమలు, మెగా డీఎస్సీ ప్రకటించామన్నారు. విద్యార్థి హాజరు శాతాన్నిబట్టి తల్లికి వందనం డబ్బులు చెల్లించే నిబంధనను అధికారులు సీఎంకు నివేదించారు. హాజరు శాతం ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపు 'తల్లికి వందనం' ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఎన్నికల హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ 'తల్లికి వందనం' ఇద్దామని సీఎం స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా కళాశాలలకు చెల్లించాలని నిర్ణయించినందున విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని కేబినెట్‌లో నిశ్చయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోపు 'మెగా డీఎస్సీ'లో ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం నిర్దేశించారు.

కేబినెట్ సమావేశం - కీలక నిర్ణయాలివే

కాలయాపన చేయవద్దు: రెవెన్యూ సదస్సుల తీరుతెన్నులు, జలవనరులు, ఆర్థిక ఇబ్బందులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా పరిష్కరానికి అవసరమైన సూచనలు చేసేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించారు. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 13వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పగా ఒకే సమస్యపై బాధితులు పదే పదే తిరగకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపడమే కీలకమని సీఎం అన్నారు. చేస్తున్నాం, చూస్తున్నాం అంటూ కాలయాపన చేయవద్దని ఆదేశించారు. అర్జీల జిరాక్సుల కోసమే బాధితులు వందలాది రూపాయల ఖర్చు మోయాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి మనోహర్ వివరించారు. ఒకచోట అర్జీ ఇచ్చాక మరో చోట ఇవ్వాలంటూ బాధితుల్ని తిప్పడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.

నధుల అనుసంధానంపై చర్చ: గోదావరి - బనకచర్ల అనుసంధానంపై కేబినెట్‌ భేటీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణ ఎలా అనే అంశాలపై చర్చించారు. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరిచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యోగి వేమన నుంచి హంద్రీనీవా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. గోదావరి - బనకచర్ల అనుసంధానం కోసం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం తెలిపారు.

పట్టిసీమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా రాయలసీమకు జరిగిన లబ్ధిని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 85శాతం రిజర్వాయర్లను నింపామన్న చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ కార్యదర్శి, ఇతర అధికారుల కృషిని అభినందించారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై ఆర్థికశాఖ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమయంలో బకాయిలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా తీయగా లక్షా 30వేల కోట్లకు పైగా ఉన్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు భారీ షాక్ - వ్యసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు రద్దు!

ఉద్యోగులకు న్యాయం: 21వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులను జగన్‌ హయాంలో మళ్లించడంపై మంత్రివర్గ భేటీ తర్వాత చర్చ జరిగింది. ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై మంత్రులు చర్చించారు. ఉద్యోగులకు జగన్ చేసిన నష్టాన్ని భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని సీఎం సూచించారు.

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన: ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై మంత్రివర్గ భేటీ అనంతరం చర్చ జరిగింది. ఎన్​టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మోదీతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లు రోడ్ షో నిర్వహించనున్నారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు మంత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్​కు మంత్రివర్గం అభినందనలు తెలిపింది. తొలిసారి బీసీ అధికారికి సీఎస్​ పదవి దక్కడంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఎస్సీ అధికారి కాకి మాధవరావుకు సీఎస్​గా నియమించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈనెల 17న మరోసారి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

'తెలియదు, గుర్తులేదు' - ఆ వ్యవహారాలన్నీ మా మేనేజరే చూసుకున్నారు!

Last Updated : Jan 2, 2025, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details