CM Chandrababu Discussions with Ministers: మంత్రివర్గ సమావేశం ముగిశాక దిల్లీ పరిణామాలు, తాజా అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చలు జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రులుగా, ప్రభుత్వపరంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లు వివరించారు. 6 నెలల పనితీరుపై ముగ్గురు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని సీఎం వెల్లడించారు. రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేశారన్నారు. మంత్రులు ఫీల్డ్ విజిట్స్ పెంచాలని సూచించారు. సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనితీరుపై ప్రత్యేకంగా మానిటర్: కక్ష సాధింపులు కాకుండా విలువులతో కూడిన రాజకీయాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకు పోతుండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియగించకపోవటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని తెలిపారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంత సేపు పెండింగ్‌లో ఉంటోందో ప్రతీదీ తనకు తెలుసునని అన్నారు. ఇంచార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయం ఊరికే రాదు - కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి