TDP MEMBERSHIP :సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమం పై చర్చించారు. శనివారం టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించింది.
రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ఉదయం నుంచి చంద్రబాబు కసరత్తు చేశారు. మూడు గంటల పాటు పదవుల పై ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. సాధ్యమైనంత త్వరగా రెండో లిస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మొదటి ఫేజ్ లో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో ఈ దఫా లిస్ట్ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతో కూడా చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. కష్టపడిని వారికి పదవి అనే విధానంలో విస్తృత కసరత్తు చేస్తున్నారు. దీని కోసం వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.