Class War in YSRCP:ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుముంటున్నాయి. నాయకుల తీరు నచ్చట్లేదని కొంత మంది, కొత్త ఇన్ఛార్జీలు వద్దని మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
YCP MLC Angry with MLA:గురజాల వైసీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి, ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తన స్వగ్రామం గామాలపాడులో స్థానిక సర్పంచికి, ప్రభుత్వ విప్‌గా ఉన్న తనకు తెలియకుండా ఆసరా చెక్కులు పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో గామాలపాడులో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు కృష్ణమూర్తికి వాగ్వాదం జరిగింది. పోలీసు బలగాలతో ప్రజాస్వామ్యాన్ని అణచాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
నంద్యాల వైసీపీలో వర్గపోరు - ఎమ్మెల్యే తీరుపై జడ్పీటీసీ నిరసన
ఒక గ్రామంలో ప్రభుత్వ పథకాలు అమలుపరిచే భాగంలో గ్రామ సర్పంచ్‌కి, ఎమ్మెల్సీని ఒక ప్రభుత్వ విప్ అయిన తనను పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారన్నారు. శాంతంగా ఉన్న పలనాడు గ్రామాల్లో గొడవలు రేపి పోలీసు బలగాలని మోహరించి ఆటవిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే కుదరదని ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని అన్నారు. 12వ వార్డు బీసీ కౌన్సిలర్ భర్త మహంకాళి నీలం రాజును గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి బెదిరిస్తున్న విధానం చూస్తుంటే పార్టీలో బీసీలకు ఉండే గౌరవం ఇదేనా అనిపిస్తుంది అన్నారు.