Clashes in AP Elections :ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ పలు ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులపై, వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. మరి కొన్నిచోట్ల టీడీపీ ఏజెంట్లపై దాడి చేసి, వారిని కిడ్నాప్ చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. పలు చోట్ల పోలింగ్‌కు కేంద్రాలకు ప్రవేశించి ఈవీఎంలు ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించారు.
పులివెందులలో జగన్, ఉండవల్లిలో చంద్రబాబు - ఏపీలో ఓటేసిన ప్రముఖులు - AP POLITICAL LEADERS VOTE 2024
Nellore District : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని సల్మాన్ పురం, పంచేడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇసుకపల్లిలో అధికార నాయకులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. వైఎస్సార్సీపీ ఓటు వేయాలని అధికార నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. వారి టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.