ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఏపీలో నిరుద్యోగులకు పండగ- మెగా డీఎస్సీ ఫైల్​పై చంద్రబాబు తొలి సంతకం - Mega DSC Posts

Mega DSC in AP : సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్​పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల జీవితాల్లో భరోసా నింపారు. మెగా డీఎస్సీ ద్వారా పాఠశాలల్లో 16,347 పోస్టులకు పచ్చజెండా ఊపారు. చంద్రబాబు నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

mega_dsc_in_ap
mega_dsc_in_ap (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 5:26 PM IST

Updated : Jun 13, 2024, 8:52 PM IST

Mega DSC in AP: ఏపీలో నిరుద్యోగులకు పండగొచ్చింది. మెగా డీఎస్సీ అంటే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉండొచ్చు అనుకుంటే అంతకు మించి ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.( Chief Minister Chandrababu ) మెగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్లస్​ అనిపించేలా 16,347 పోస్టుల ఫైల్​పై తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ పైల్​పైనే తొలి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు ఫైల్‌పై రెండో సంతకం, సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు.

DSC candidates Reaction in AP:ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం, మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేసిన చంద్రబాబుకు గుంటూరులో అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. జగన్‌ పాలనలో ఉపాధ్యాయ భర్తీ నోటిఫికేషన్ విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని వాపోయారు. చాలా మంది అభ్యర్థులు వయోభారంతో అవకాశాలు కోల్పోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తమకెంతో మేలు జరుగుతుందని డీఎస్సీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.

హర్షం వ్యక్తం చేసిన డీఎస్సీ అభ్యర్థులు (ETV Bharat)

తెలుగుదేశం అధికారం చేపట్టిన 24 గంటల్లోపే మెగా డీఎస్సీ పై సంతకం చేస్తామన్న నారా లోకేశ్ (Nara Lokesh) మాట నిలబెట్టుకున్నారని డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా మెగా డీఎస్సీపేరుతో జగన్ నిరుద్యోగులను దగా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే తెదేపాతోనే సాధ్యమన్నారు. డీఎస్సీ పై మెుదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు నిరుద్యోగ యువత ధన్యవాదాలు తెలిపారు.

మెగా డీఎస్సీ 2024 ఖాళీల వివరాలివే..

  • ఎస్​జీటీ 6,371
  • వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 132
  • స్కూల్​ అసిస్టెంట్​ 7,725
  • టీజీటీ పోస్టులు 1,781
  • పీజీటీ పోస్టులు 286
  • ప్రిన్సిపాళ్లు 52
  • మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం చేశారు.
Last Updated : Jun 13, 2024, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details