ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign - CHANDRABABU ELECTION CAMPAIGN

Chandrababu Praja Galam Public Meeting In Tadikonda: కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ వస్తుందని, జూన్‌ 4న విజయోత్సవాలు చేసుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అమరావతి రక్షణ, జగనాసుర వధ, రెండూ జరుగుతాయని పేర్కొన్నారు.f

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 8:09 PM IST

Chandrababu Praja Galam Public Meeting In Tadikonda :కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ వస్తుందని, జూన్‌ 4న విజయోత్సవాలు చేసుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అమరావతి రక్షణ, జగనాసుర వధ, రెండూ జరుగుతాయని పేర్కొన్నారు.

పోరాడిన వారిపై 3 వేలకు పైగా కేసులు : 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించిందని అన్నారు.

అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశామని అన్నారు. విజన్ ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యంమని అన్నారు. అమరావతి కోసం పోరాడిన వారిపై 3 వేలకు పైగా కేసులు బనాయించారని ఆరోపించారు. అమరావతి రైతులను జైళ్లలో పెట్టి రకరకాలుగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని, కర్నూలును అభివృద్ధి చేస్తానని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతానికి నీరిచ్చామని అన్నారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు - Bapatla Prajagalam Sabha

మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట :విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శరాజధాని చేయాలనుకున్నామని అన్నారు. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించానని, సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నానని గుర్తు చేశారు. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని నిప్పులు చెరిగారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు, ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరని స్పష్టం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా అని, మన రాజధాని అమరావతే అని అన్నారు. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తామని, గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయని తెలిపారు. ఆ జిల్లాల్లో వైసీపీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు, జగనాసుర వధ కూడా జరుగుతుందని పేర్కొన్నారు. "జగన్‌ పోవాలి - ప్రజలు గెలవాలి" అని పిలుపునిచ్చారు.

వైసీపీలోని మంచివాళ్లు టీడీపీలోకి రావాలి- ఐదేళ్లలో జగన్‌ ఎవరినైనా కలిశారా?: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

నిరుద్యోగులను మోసం చేశారు : వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని ఆరోపించారు. జాబ్‌ క్యాలెండర్‌,మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారని, సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు. చేశారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు ఇవ్వలేదని, బడికి రంగులు వేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్ సభలకు జనం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారని, కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారని గుర్తు చేశారు.

రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ దిగిపోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చిందని, తాను సీఎంగా ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తయ్యేదని అన్నారు. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నానని గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, జూన్‌ 4న ఇక్కడ విజయోత్సవాలు చేసుకుందామని అన్నారు. తాను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాని చంద్రబాబు భరోసా కల్పించారు..

కానిస్టేబుల్ ఆత్మహత్యపై చంద్రబాబు దిగ్బ్రాంతి- పోలీసులపై ఒత్తిళ్లు పెరిగాయంటూ ఆవేదన - cbn react on SPF Constable Suicide

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ - రెండూ జరుగుతాయి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details