తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేంద్ర మంత్రిగా తొలిసారి రాష్ట్రానికి వచ్చిన బండి సంజయ్​ - కరీంనగర్​లో కమాన్ వద్ద సాష్టాంగ నమస్కారం - Bandi Sanjay Telangana Visit - BANDI SANJAY TELANGANA VISIT

Central Minister Bandi Sanjay Telangana Visit : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్​ తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. కరీంనగర్​ పార్లమెంట్​ పరిధిలోని శనిగరంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాకతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Bandi Sanjay Telangana Visit
Central Minister Bandi Sanjay (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 12:15 PM IST

Updated : Jun 19, 2024, 5:46 PM IST

Central Minister Bandi Sanjay Visit Karimnagar: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. శామీర్‌పేట వద్ద బీజేపీ కార్యకర్తలు, అభిమానులు బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో గజమాలతో బండి సంజయ్ కుమార్‌ను సత్కరించారు. కరీంనగర్​ లోక్​సభ పరిధిలోని శనిగరం నుంచి ర్యాలీగా బండి సంజయ్‌ కరీంనగర్ చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాకతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్​కు చేరుకున్న బండిసంజయ్​ ప్రచార రథంపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం కమాన్​ వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతమాతాకీ జై అంటూ నినదించారు. నేరుగా రోడ్లు భవనాల శాఖ విశ్రాంతిభవనం చేరుకున్న బండి సంజయ్ కుమార్​ పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనంలో పిఎన్జీవోల ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు బండి సంజయ్​ను సత్కరించారు.

గో రక్షా కార్యకర్తకు కేంద్రమంత్రి బండి సంజయ్​ ఫోన్​ - మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశం

MP Bandi Sanjay Telangana Tour: బండి సంజయ్ కరీంనగర్​లోని మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత కొండగట్టుకు వెళ్లనున్నారు. చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడనున్నారు. అనంతరం జగిత్యాలలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీ రాజశ్రీరాజేశ్వర ఆలయానికి చేరుకుని రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు రాజన్న సిరిసిల్లకు వెళ్లనున్నారు. అనంతరం మార్కండేయ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను సమావేశమవుతారు. సిరిసిల్ల పర్యటన ముగించుకుని కరీంనగర్​కు వచ్చి రాత్రి తన నివాసంలో బస చేయనున్నారు.

Bandi Sanjay as a Central Minister: రాష్ట్రంలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కరీంనగర్​ పార్లమెంట్​ స్థానం నుంచి రెండోసారి ఎంపీగా బీజేపీ తరుఫున పోటీ చేస్తూ బండి సంజయ్ గెలిపొందారు. దీంతో బీజేపీ ఆయన సేవను గుర్తించి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో కేంద్ర హోం మంత్రి సహాయ మంత్రిగా అవకాశం గెలిపించింది. దీంతో ఆయన దిల్లీకి వెళ్లి ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం నుంచి బండి సంజయ్​తో పాటు ఎంపీ కిషన్​రెడ్డికి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన బొగ్గు, గనులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

విద్యుత్​ కొనుగోళ్లపై నియమించిన ఛైర్మన్‌ను వైదొలగాలని కేసీఆర్ బెదిరించడం ముమ్మాటికీ ధిక్కరణే: బండి సంజయ్‌ - bandi sanjay fires on kcr

Last Updated : Jun 19, 2024, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details