CENTRAL SPECIAL FUNDS TO AP : రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ సీఎం హోదాలో రెండు సార్లు దిల్లీ వెళ్లిన చంద్రబాబు తాను అనుకున్నది సాధించారు. రాష్ట్రానికి రెండు కళ్ల లాంటి అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రాన్ని ఒప్పించారు. వీటికి తోడు విభజన చట్టంలోని హామీలపైనా కేంద్రం స్పష్టత ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది. పారిశ్రామిక అభివృద్ధికి తోడు నైపుణ్య గణన ఫలితంగా యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
ఎన్డీఏ కూటమికి ఊహించని భారీ మెజార్టీతో విజయాన్నందించిన రాష్ట్రానికి కేంద్రం అదే స్థాయిలో వరాలు ప్రకటించింది. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా రాష్ట్ర జీవనాడి పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించింది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించేలా రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయంతో పాటు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024 గణాంకాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసేలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని ప్రకటించింది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు అందిస్తామని స్పష్టం చేసింది.
"దటీజ్ చంద్రబాబు" హాట్‌టాపిక్‌గా దిల్లీ తొలి పర్యటన- నాడు జగన్ 29సార్లు - CBN Delhi Tour