Cabinet Sub Sommittee Meeting on New Liquor Policy:నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కొత్త మద్యం విధానంపై తమ అభిప్రాయాన్ని మంత్రివర్గ ఉపసంఘం సీఎంకు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న మద్యం విధానాలను కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గురువారం నాడు క్యాబినెట్ సమావేశంలో కొత్త మద్యం విధానంపై చర్చించి నిర్ణయం తీసుకున్న అనంతరం రాష్ట్రంలో అమలు కోసం దాన్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజల జేబుల్లో డబ్బు లూటీ:గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను సర్వ నాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అక్రమ మద్యం విధానం అమలు కోసం జగన్ ప్రభుత్వం సెబ్‌ను పెట్టిందని, జే బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మించారని విమర్శించారు. రేట్లు పెంచి మద్యం నియంత్రణ చేస్తామని చెప్పారు. కానీ ప్రజల జేబుల్లో డబ్బు లూటీ చేశారని ఆరోపించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానం కోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామన్నారు.
లాటరీ ద్వారా దుకాణాలు:వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అత్యంత పెద్ద లిక్కర్ సిండికేట్ జగన్ మాత్రమేనని ఆరోపించారు. బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లు ఇప్పటికే ఆగిపోయాయని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లు గీత కార్మికులకు 10 శాతం దుకాణాలు కేటాయించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు దుకాణాలు లాటరీ ద్వారా కేటాయిస్తారని స్పష్టం చేసారు. మద్యంపై పన్నులను కూడా సవరిస్తామని పేర్కొన్నారు.
భక్తులకు నాణ్యమైన ఆహారం అందించపోతే కఠిన చర్యలు: టీటీడీ ఈవో శ్యామలరావు - TTD EO Syamala Rao on hotels