తెలంగాణ

telangana

ETV Bharat / politics

కేసీఆర్​ను కలిసిన కవిత - కూతుర్ని చూడగానే ఎమోషనల్ అయిన గులాబీ బాస్ - MLC KAVITHA MEETS KCR TODAY - MLC KAVITHA MEETS KCR TODAY

MLC Kavitha Meets KCR Today: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఐదు నెలల తర్వాత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్​ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి చేరుకున్న ఆమెకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. కూతురిని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

MLC Kavitha Meets KCR Today
MLC Kavitha Meets KCR Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 2:05 PM IST

Updated : Aug 29, 2024, 3:17 PM IST

Kavitha KCR Emotional Moments :దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్​పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం రోజున హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ (ఆగస్టు 29వతేదీ) మధ్యాహ్నం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్​ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో పుట్టింటికి వచ్చిన కవితకు, ఎర్రవల్లి గ్రామస్థులు మంగళహారతి పట్టి ఘనస్వాగతం పలికారు.

అనంతరం కేసీఆర్ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ ఆనందంతో ఉప్పొంగారు. తమ అధినేత సంతోషంలో భాగస్వామ్యులైన సిబ్బంది, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ ఆలింగనం చేసుకున్న ఫోటోను కవిత తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత 164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. వాటిని అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేసింది.

తల్లిని చూసి కన్నీరు పెట్టుకుని, హత్తుకున్న ఎమ్మెల్సీ కవిత - వీడియో వైరల్ - mlc kavitha reach home video viral

హైదరాబాద్‌కు చేరుకున్న కవిత - కడిగిన ముత్యంలా బయటపడతానంటూ పునరుద్ఘాటన - MLC KAVITHA REACHED HYDERABAD

Last Updated : Aug 29, 2024, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details