Kavitha KCR Emotional Moments :దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం రోజున హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఇవాళ (ఆగస్టు 29వతేదీ) మధ్యాహ్నం ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు. తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో పుట్టింటికి వచ్చిన కవితకు ఎర్రవల్లి గ్రామస్థులు మంగళహారతి పట్టి ఘనస్వాగం పలికారు.
కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత- భావోద్వేగానికి గురైన గులాబీ బాస్ - MLC KAVITHA MEET KCR - MLC KAVITHA MEET KCR
MLC Kavitha Meets KCR Today: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఐదు నెలల తర్వాత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి చేరుకున్న ఆమెకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. కూతురిని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
MLC KAVITHA MEET KCR (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 2:31 PM IST
అనంతరం కేసీఆర్ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పదిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు. నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.