BRS Leader KTR Sent Legal Notice to Union Minister Bandi Sanjay :కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలంగాణ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తనకు పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. చేసిన నిరాధార వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలి :ఈ నెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్ చేశారు. కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు.