తెలంగాణ

telangana

ETV Bharat / politics

రుణమాఫీ తీరు చూస్తుంటే 'చారాణా కోడికి బారాణా మసాలా' అన్నట్లుంది : కేటీఆర్​ - KTR Tweet On Loan loan Waiver - KTR TWEET ON LOAN LOAN WAIVER

KTR Tweet On Loan loan Waiver : రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి సీఎం రేవంత్​ రెడ్డిపై బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధక్షుడు కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలని ప్రశ్నించారు. రుణమాఫీ అయిన రైతన్నల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువని ఆయన విమర్శించారు. ఈ మేరకు 'ఎక్స్'​ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

KTR Tweet On Loan loan Waiver
KTR Tweet On Loan loan Waiver (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 2:39 PM IST

KTR Tweet On Loan loan Waiver : ఊరించి ఏడు నెలలు ఏమార్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు చూస్తే 'చారాణా కోడికి బారాణా మసాలా' అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రక్రియపై 'ఎక్స్' వేదికగా హస్తం​ పార్టీపై ఘాటుగా స్పందించారు. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Fires On CM Revanth :ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలు అయ్యాయని కేటీఆర్​ ఆరోపించారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని, రైతన్నలు తమ గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని అన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

రైతు భరోసా డబ్బులు ఇంకా వేయలేదు :రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా ప్రారంభించలేదని జూన్​లో వేయాల్సిన రైతుభరోసా నిధులను జులై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదని ఆక్షేపించారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15 వేల రూపాయలు కూడా ఇవ్వలేదని రైతు కూలీలకు ఇచ్చిన 12 వేల రూపాయల హామీ ఇంకా అమలు చెయ్యలేదని మండిపడ్డారు. మభ్యపెట్టే పాలన అన్న కేటీఆర్ ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని ఎద్దేవా చేశారు.

20 శాతమే రైతు రుణమాఫీ చేసింది :రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్​ సీనియర్​ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం 20 శాతమే రుణమాఫీ చేసి గొప్పలు చెబుతోందని దుయ్యబట్టారు. రేవంత్​ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్న ఆయన రైతు భరోసా ఇస్తామన్నారు ఏమయ్యిందంటూ? ప్రశ్నించారు. అన్నదాతల సమస్యలు తెలుసుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లరని పల్లా విమర్శించారు.

కాంగ్రెస్ పాలన గాలికి వదిలేసి కక్షలు, ప్రతీకార చర్యలపై దృష్టి పెట్టింది: కేటీఆర్

కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery

ABOUT THE AUTHOR

...view details