Boora Narsaiah Goud On Vishwakarma Yojana Scheme :రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ యోజన పథకంలో భాగంగా 18 కులాలకు సంబంధించిన లక్ష 20 వేల మంది లబ్ధిదారులను వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మందికి కూడా వెరిఫికేషన్ చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో లంకె బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయన్నారని గుర్తు చేసిన బూర నర్సయ్య గౌడ్, కేంద్ర ప్రభుత్వం లంకె బిందెలు ఇస్తుంటే ఎందుకు వెరిఫికేషన్ చేయించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమై విశ్వకర్మ పథకంలో భాగంగా 18 కులాలకు సంబంధించిన వెరిఫికేషన్‌కు ఆదేశించాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే వెరిఫికేషన్‌ను పది రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ రెండు పార్టీలు పోటీ పడి తిట్టుకుంటున్నాయని ఆరోపించారు.
Boora Narsaiah Goud about MP Elections :ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లు గెలిపిస్తే, కృష్ణా, గోదావరి జలాల పంపిణీకీ శాశ్వత పరిష్కారం చుపుతామని, రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ దిల్లీలో లేదు గల్లీలో లేదన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.