ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 1:25 PM IST

ETV Bharat / politics

దొంగ ఓట్లతో గెలవాలన్నదే వైసీపీ వైనాట్ 175 నినాదం వెనుక కుట్ర : పురందేశ్వరి

BJP Purandeswari Comments About Fake Votes: వైసీపీ నాయకులు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని, దీన్ని వెనుక నుంచి సీఎం జగన్‌ నడిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు మితిమీరుతున్నాయని ధ్వజమెత్తారు. దొంగ ఎపిక్ కార్డులతో గెలవాలని వైసీపీ చూస్తోందని, అందుకే వై నాట్ 175 అంటున్నారని మండిపడ్డారు.

BJP_Purandeswari_Comments
BJP_Purandeswari_Comments

దొంగ ఓట్లతో గెలవాలన్నదే వైసీపీ వైనాట్ 175 నినాదం వెనుక కుట్ర : పురందేశ్వరి

BJP Purandeswari Comments About Fake Votes: ఓటర్ల జాబితాలో అక్రమాలు కేవలం తిరుపతి ఉప ఎన్నికలకే పరిమితం అయ్యానుకుంటే పొరపాటేనని భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తమ పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులపైనే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతోపాటు పోలీసు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు.

ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాశామన్నారు. తమ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్రాజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే రెండు లక్షల 70 వేల ఓట్లకు 61 వేల మంది ఓటర్లు భౌతికంగా స్థానికంగా లేని వారు పేర్లు జాబితాలో కల్పించినట్లు బయటపడిందన్నారు. తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికల్లో ఫేక్ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులు తయారు చేశారని, కార్డుల్లోని ఫోటోలు బ్లర్ చేసి 35 వేల దొంగఓట్లు డౌన్ లోడ్ చేసినట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీ అక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: పురందేశ్వరి

అందుకేనా వైనాట్ 175 అంటున్నారు: రుజువులతో సహా తాము గుర్తించి చేసిన ఫిర్యాదుల వల్లే అధికారులపై చర్యలు చేపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ (YS Jagan Mohan Reddy) వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురందేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి దొంగ ఓట్లు, దొంగ ఎపిక్ కార్డులు, బోగస్ ఓటర్ల జాబితాతో లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల వైసీపీ (YSRCP) తమ అభ్యర్ధులను ఒక చోట నుంచి మరొక చోటకు మార్పులు చేస్తోందని, అదే సమయంలో ఓటర్లను కూడా గంపగుత్తుగా ఒకచోట నుంచి మరొక చోటకు బదిలీ చేస్తున్నారని అన్నారు.

చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన విడుదల రజని (Vidadala Rajini)ని ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారని, ఆమెతో పాటు 10 వేల మంది ఆమె అనుయాయుల పేర్లను కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నమోదు చేయించే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈ విషయాల పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని కోరారు. నియంతృత్వం మినహా వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వాతావరణం లేకుండా పోయిందని పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావిస్తే కేసులు, అరెస్టులు, అణచివేతలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ - ఓట్ల అక్రమాలపై విచారణ జరిపించాలి : పురందేశ్వరి

కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం: కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సైతం తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా అధికారులు అవి కేంద్ర పథకాలుగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి వచ్చిందని అన్నారు. వికసిత్ భారత్ యాత్రలో అర్హత ఉండి పథకాలు అందుకోలేకపోయిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లబ్ధి చేకూర్చామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో సింహభాగం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే అనే విషయాన్ని ప్రజలు సైతం అర్ధం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన సేవ, సహకారం, అభివృద్ధి గురించి ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ స్థాయిల్లో ప్రజలకు వివరించేందుకు ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని పురందేశ్వరి తెలిపారు.

దొంగ ఓటర్ల చేర్పు - నకిలీ ఓటర్ కార్డులు ప్రింట్ చేస్తోన్న జగన్​ సర్కార్ : పురందేశ్వరి

ABOUT THE AUTHOR

...view details