BJP Andhra Pradesh MLA Candidates List :ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులు :
- అనపర్తి- శివకృష్ణంరాజు
- ఎచ్చర్ల - ఎన్. ఈశ్వరరావు
- విశాఖ నార్త్ - పి. విష్ణు కుమార్ రాజు
- ధర్మవరం - వై.సత్యకుమార్
- విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
- కైకలూరు- కామినేని శ్రీనివాసరావు
- ఆదోని - పీవీ పార్థసారధి
- అరకు వ్యాలీ - పాంగి రాజారావు
- జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
- బద్వేలు - బొజ్జా రోషన్న
లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - BJP MP Candidates List
BJP Announced Andhra Pradesh Lok Sabha Candidates : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 24 వ తేదీ బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఐదో విడతలో 111 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది.