Bihar MLAs Camp in Hyderabad : క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ వేదికైంది. బిహార్‌లో ఇటీవల జేడీయూ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో భాగంగా అక్కడి శాసనసభలో ఈ నెల 12న బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బిహార్‌లోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. వారు ప్రత్యేక విమానంలో పట్నా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు.
12 వరకు ఇక్కడే బిహార్ ఎమ్మెల్యేలు :స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో ఉండేలా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ రిసార్ట్స్‌కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ వారిని కలవకుండా కాంగ్రెస్ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బిహార్ ఎమ్మెల్యేలను(Bihar Congress MLAs) ఈ నెల 12 వరకూ రిసార్టులోనే ఉంచాలని పై నుంచి ఆదేశాలున్నాయని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈలోగా పరిణామాలేమైనా మారితే తప్ప, 12వ తేదీ ఉదయం దాకా వారు ఇక్కడే ఉంటారని ఆయన చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలను ఒకే రిసార్ట్స్‌లో ఉంచకుండా ప్రతి రెండు రోజులకు ఒకసారి వారిని రిసార్ట్స్ మార్చాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తొమ్మిదోసారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణం- డిప్యూటీలుగా సామ్రాట్, విజయ్
Bihar Congress MLAs in Hyderabad :బీజేపీ, జేడీయూ ప్రభుత్వం (Bihar Political Crisis)తమ పార్టీకి చెందిన బిహార్ ఎమ్మెల్యేలను వారి పక్షంలోకి లాగేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నందునే కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమై హైదరాబాద్‌కు పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ శాసనసభ్యులు చీలిపోతారనే వదంతులు వ్యాప్తిలో ఉన్నా నిజానికి జేడీ(యూ) ఎమ్మెల్యేలపైనే విపరీతమైన ఒత్తిడి ఉందని ఏఐసీసీ బిహార్ వ్యవహారాల ఇంఛార్జ్ మోహన్ ప్రకాశ్ పట్నాలో తెలిపారు.