Bandi Sanjay Oath as a Central Minister: పన్నెండేళ్ల వయస్సులోనే రాజకీయాలపై ఆసక్తి చూపించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. అక్కడ తాను చురుకుగా పని చేసి అందరి మన్ననలు పొందారు. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు మరింత చురుకుగా పని చేసి, రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించారు. అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయనే కరీంనగర్ నుంచి లోక్‌సభ స్థానానికి ఎన్నికైన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. అతని రాజకీయ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Bandi Sanjay Political Career : బండి సంజయ్ 1971లో కరీంనగర్లో జన్మించారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్‌గా పని చేశారు. ఎల్.కె. అడ్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.
కేంద్రమంత్రి వర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి చోటు - UNION MINISTRY TO BANDI SANJAY AND KISHAN REDDY
Bandi Sanjay Political Journey : కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం అయ్యారు.
Bandi Sanjay as a Central Minister : 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్‌కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది. కిషన్ రెడ్డి సహా ఈయనకూ కేంద్రమంత్రి పదవి దక్కింది.
అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్‌సభ వార్‌లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024