ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఆ ఎమ్మెల్యేకు అత్యధిక శాతం ఓట్లు - నోటాకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా? - AP Election voting percentage - AP ELECTION VOTING PERCENTAGE

AP Election Voting Percentage 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది.

AP Election Voting Percentage 2024
AP Election Voting Percentage 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 11:33 AM IST

AP Election Voting Percentage 2024 :ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ (70.24%), మహిళల్లో విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు (64.21%)లకు అత్యధిక శాతం ఓట్లు వచ్చినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (Association for Democratic Reforms) (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల విశ్లేషణ పత్రాన్ని ఆ సంస్థ విడుదల చేసింది.

  • శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర టీడీపీ అభ్యర్థి ఎం.ఎస్‌.రాజు (0.19%), ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి (0.47%) అత్యల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.
  • ఈ ఎన్నికల్లో టీడీపీకు 45.60%, వైఎస్సార్సీపీకు 39.37%, జనసేనకు 6.87%, బీజేపీకు 2.83%, కాంగ్రెస్‌కు 1.72%, నోటాకు 1.09%, బీఎస్పీకి 0.60%, సీపీఎంకు 0.13%, సీపీఐకి 0.04%, ఇతర పార్టీలకు 1.75% ఓట్లు పోలయ్యాయి.
  • 175 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది మహిళలు ఉన్నారు. మహిళా విజేతలందరికీ 40%కిపైగా ఓట్లు లభించాయి.
  • శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నోటాకు అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో సాలూరు (3.63%), రంపచోడవరం (3.45%) ఉన్నాయి.

ఏపీ ఎన్నికల్లో ప్రముఖుల నియోజకవర్గల్లో పోలింగ్​ శాతం ఎంతంటే!? - polling in Celebrity Constituencies

ABOUT THE AUTHOR

...view details