Pawan Kalyan Meet Karnataka CM Siddaramaiah: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటిీ అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు. ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అదే విధంగా కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరారు. ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం వారి మధ్య చర్చకు వచ్చింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పవన్ కల్యాణ్ సమావేశం - Pawan Kalyan Meet Karnataka CM - PAWAN KALYAN MEET KARNATAKA CM
Pawan Kalyan Meet Karnataka CM Siddaramaiah: బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో సమావేశం అయ్యారు. వన్యప్రాణి, అటవీ సంరక్షణతో పాటు వివిధ అంశాలపై సిద్ధరామయ్యతో పవన్ చర్చలు జరిపారు.
Pawan Kalyan Meet Karnataka CM (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 3:25 PM IST
పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని తెలిపారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ చర్చల్లో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు సైతం ఛైర్మన్ పాల్గొన్నారు.