ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వైఎస్సార్సీపీ ఐదో జాబితాపై జగన్​ కసరత్తు - సీట్లెవరివో, పాట్లెవరికో!

YSRCP MLA Fifth List: శాసనసభ, లోక్‌సభ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు కొనసాగుతోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఇన్ చార్జీల మార్పులతో ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసి మొత్తంగా 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ముగ్గురు ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపారు. మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తప్పిస్తూ ఐదో జాబితాను సీఎం రూపొందిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు రావడంతో వారంతా సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 3:38 PM IST

Etv Bharat
Etv Bharat


YSRCP MLA Fifth List: ఎన్నికలు సమీపించిన తరుణంలో సీఎం జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పులుపై గత కొంత కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేయగా, తాజాగా ఐదో జాబితా కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ మెరకు వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యుర్థులకు సీఎంవో నుంచి ఫోన్ వచ్చింది. సీఎంవో నుంచి ఫోన్ రావడంతో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ భరత్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సీఎంవోకు చేరుకున్నారు. వీరే కాకుండా టికెట్ ఆశిస్తున్న నేతలంతా తాడేపల్లి క్యాంప్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
విజయవాడలో తాగునీటి కష్టాలు- ప్రభుత్వానికి టీడీపీ నేతల హెచ్చరిక

పలు పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జీల మార్పులతో ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేశారు. తాజాగా తాడేపల్లి లోని సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు రావడంతో వారంతా సీఎం క్యాంప్ ఆఫీస్ కి వచ్చారు. దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఇటీవలే సీఎం తప్పించారు. ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చారు. దీంతో తనకు ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలని మద్దిశెట్టి వేణు పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలు మార్లు సీఎం కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి ఎమ్మెల్సీ భరత్ ను సీఎం క్యాంప్ ఆఫీస్ కి పిలిపించారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నూ తాడేపల్లి పిలిపించారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తాడేపల్లి వచ్చి మంతనాలు జరిపారు.
విద్యార్థులపై వింత ప్రయోగాలు - వాస్తవ పరిస్థితిని దాచేస్తున్న వైసీపీ సర్కార్

ఎమ్మెల్యే సీటు కోసం ఉప ముఖ్యమంత్రి మంతనాలు: తనకు గంగాధర నెల్లూరు అసెంబ్లీ సీటు ఇవ్వాలని అనుచరగణంతో ఆందోళనలు చేయిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి క్యాంప్ కార్యాలయానికి వచ్చి మంతనాలు జరిపారు. తాడేపల్లి వచ్చి పలువురు నేతలు సీఎం జగన్​తో భేటీ కంటే ముందుగా సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ని కలుసుకున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులపై వారితో చర్చిస్తూ, వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మొత్తంగా 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకుండా, సీఎం జగన్ మొండిచేయి చూపారు. మరికొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తప్పిస్తూ ఐదో జాబితాను సీఎం రూపొందిస్తున్నారు.

మమ్మల్ని కాదని వస్తారా- వైసీపీలో మొదలైన తిరుగుబాటు! కాళ్లబేరానికి సిద్ధమైన అధిష్ఠానం

ABOUT THE AUTHOR

...view details