ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ప్రభుత్వ యాప్​లో పేషంట్ పూర్తి వివరాలుండాలి- వైద్య సమీక్షలో సీఎం చంద్రబాబు - Chandrababu Review on Health Dept - CHANDRABABU REVIEW ON HEALTH DEPT

CM Chandrababu Review on Health Department: ప్రభుత్వాస్పత్రులను దేశంలోనే బెస్ట్​గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం సర్కారు దవాఖానాలను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, మెరుగైన వసతులు కల్పించి మళ్లీ ప్రభుత్వాస్పత్రులపై విశ్వాసం పెంచాలని నిర్దేశించారు.ఫేక్ సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

CM Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 9:04 PM IST

CM Chandrababu Review on Health Department: వైద్యారోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలన్నారు. ఆస్పత్రిలో రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్ మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలన్నారు. ఇలా చేయడం వల్ల ఆసుపత్రి పనితీరు ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలని, రోగులకు శుభ్రమైన బెడ్ షీట్లు అందించాలని నిర్దేశించారు.

ముఖ్యమంత్రి ఆగ్రహం: నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, ఆ ఆస్పత్రులకు ప్రభుత్వమే స్థలం అందిస్తుందన్నారు. ప్రభుత్వ, పీపీపీ ఆసుపత్రలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై పూర్తిగా సమాచారం సేకరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

త్వరలోనే జన్మభూమి-2 - నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చ - టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు - TDP PolitBuro Meeting

మండలాల వారీగా వివరాలు సేకరించాలి: రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంత మంది ఉన్నారో మండలాల వారీగా వివరాలు సేకరించాలని సూచించారు. కిడ్నీ సమస్య కారణాలపై అధ్యయనం చేయాలన్నా సీఎం కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటి సదుపాయంపైనా లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. గతంలో ఉద్దానంలో పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేయడం వల్లే పూర్తి స్థాయిలో సమస్యను గుర్తించగలిగామన్నారు.

ఉద్దానంలాగే ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్​ను ముందుగా అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ప్రి ల్యాబ్ టెస్ట్​ల అనంతరం పేషెంట్లకు సరైన విధానంలో మెడిసిన్ ఇవ్వగలిగితే 50 శాతం కంట్రోల్ చేయొచ్చుని తెలిపారు. రోగులకు డైట్ ప్లాన్, న్యూట్రిషన్ పై అవగాహన కల్పించగలిగితే వ్యాధుల నుంచి కాపాడవచ్చన్నారు.

క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలి: క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారో సమగ్ర అధ్యయనం చేసి వారికి కంటిన్యూగా మెడిసిన్ అందించాలన్నారు. పేదలకు అందుబాటులో ఉండేలా సిటీ స్కాన్ సర్వీసెస్​ను అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.

గ్రామసభల్లో భూ సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం - కేబినెట్​ భేటీలో నిర్ణయం - AP Cabinet Decisions

నిర్లక్ష్యం వహిస్తే నేరుగా నేనే సందర్శిస్తా:ఆస్పత్రులలో ప్రసవం తర్వాత శిశువుల మిస్సింగ్ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మిస్సింగ్ కేసులు వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్​ను మళ్లీ తల్లులకు అందించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా డోలీ మోతలు కనిపించకూడదన్న సీఎం, ఫీడర్ అంబులెన్స్​ల ద్వారా రోగులను తరలించాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు. 104 అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని తెలిపారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరి కాదన్నారు.

ప్రతి పాఠశాలలో పిల్లలకు కంటి పరీక్షలు చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో రిపోర్టు చేయాలని సీఎం నిర్దేశించారు. టెలీ మెడిసిన్​కు గతంలో వరల్డ్ బ్యాంకు నుంచి 2 వేల 300 కోట్లు నిధులు తీసుకొచ్చామన్నారు. కార్పొరేట్ లెవల్లో సేవలు అందించాలని గ్రామాల్లో ఉండేవారికి టెలీ మెడిసిన్ ద్వారా మంచి డాక్టర్లతో అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ దాన్ని గత ప్రభుత్వం సరిగా అమలు చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు. టెలీ మెడిసిన్​పై ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్‌గా ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దాలన్నారు.

పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers

ABOUT THE AUTHOR

...view details