ETV Bharat / state

నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యం - స్పష్టం చేసిన చంద్రబాబు - CM INSTRUCTIONS TO ASPS AND DSPS

సచివాలయంలో ప్రొబేషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలతో సమావేశమైన సీఎం - శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా ఉండాలని సూచనలు

CM_Instructions_to_SPs_and_DSPs
CM_Instructions_to_SPs_and_DSPs (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 10:45 PM IST

Updated : Jan 2, 2025, 10:55 PM IST

CM Instructions to Probationary ASPs and DSPs: రాష్ట్రంలో నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రోబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావని ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధుల్ని వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సీఎం తెలిపారు. గత ఐదేళ్లలో కొందరు కళింకిత పోలీసు అధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరించి వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేదని ఈ కారణంగానే నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంపైనా ప్రస్తుతం దృష్టిపెట్టామని సీఎం స్పష్టం చేశారు.

విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు -25 కి.మీ మేర డబుల్ డెక్కర్ విధానం

విధుల్లో ఎక్కడా రాజీ పడొద్దు: కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఏఎస్పీలు, డీఎస్పీలు ఎక్కడా రాజీ పడొద్దని సీఎం హితవు పలికారు. గంజాయి రవాణా, బెల్ట్ షాపులు నిర్వహణ, ఇసుక అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సైబర్ నేరగాళ్లు కూడా రానున్న రోజుల్లో ప్రధాన సవాలుగా మారుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. వారికంటే మెరుగ్గా ఆలోచించినప్పుడే నేరాలను అరికట్టగలుగుతామని నేరస్తులకు మీరు ఎక్కడా అవకాశం ఇవ్వొద్దని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. అంచనాలకు అనుగుణంగా పని చేయాలని సీఎం సూచించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలని గతంలో పోలీసులకు టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని స్ఫష్టం చేశారు. బాడీ వోర్న్ కెమెరాలు, సీసీ కెమెరాలు, వంటి పరికరాలు తెచ్చామని తద్వారా నేరస్తులను గుర్తించడంతో నేరాల సంఖ్య తగ్గిందని సీఎం అన్నారు. గడచిన ఐదేళ్లూ వాటిని నిర్వీర్యం చేశారని సీఎం ఆక్షేపించారు. మహిళలు, చిన్నారులపై కొందరు మానవత్వం మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలపాలను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు.

జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయి: పవన్‌ కల్యాణ్‌

ఆలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి - అధికారులకు సీఎం చంద్రబాబు సూచన

Last Updated : Jan 2, 2025, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.