Kadapa Election Results 2024 :వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకాలోనూ కూటమి హవానే కొనసాగుతోంది. మొత్తం జిల్లాలో రెండు స్థానాల్లో మినహా అన్ని సీట్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. పులివెందులలో జగన్ 61,176 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 28 వేల ఓట్ల మెజారిటీ తగ్గింది.2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సునామీకి వైసీపీ గల్లంతైంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదుచోట్ల టీడీపీ ముందంజలో ఉంది.
కౌంటింగ్ ముగియక ముందే వెనుతిరిగిన వైసీపీ అభ్యర్థులు :30 ఏళ్ల నవాబుల పాలనలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కడపలో పాగా వేసింది. ప్రొద్దుటూరు వైసీపీ శాసనసభలో శివప్రసాద్ రెడ్డి పదో రౌండ్ ముగియకముందే వెనుతిరిగారు. అలానే ముఖ్యమంత్రి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా తన ఓటమిని అంగీకరిస్తూ మధ్యలోనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష కూడా 15వ రెండు లోనే మెజార్టీ తక్కువ రావడంతో ఆయన కూడా కౌంటింగ్ పూర్తికాముందే ఇంటిబాటపట్టారు. జమ్మలమడుగు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి కూడా మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.