Parties Speed UP MLC Election Campaign : పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని మల్లన్న విమర్శించారు.
MLC Election Campaign by Congress Party Leaders :కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, పూల రవీందర్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన డోర్నకల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాకేశ్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం :వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోనూ బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అభ్యర్థించారు. అబద్ధాలు చెప్పిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్లో అబాసు పాలైందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.
"కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. ఆయన చేసినవన్నీ తీసేస్తారంట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తుందట. తీయిస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ది చెప్పండి. రాకేశ్ రెడ్డిని గెలిపించండి. ఆయన శాసనమండలిలో వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాడతారు"- హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత