తెలంగాణ

telangana

ETV Bharat / photos

సమ్మర్​లో ఈ యోగాసనాలు వేస్తే చాలు- డీహైడ్రేషన్ సమస్య నుంచి ఫుల్ సేఫ్​! - Hydration Yoga Asanas - HYDRATION YOGA ASANAS

Yoga For Hydration In Telugu : సీజన్ మారినప్పుడల్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ప్రస్తుతమైతే వేసవికాలం కావడం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ, వేడి శరీరంలోని శక్తిని ఆవిరయ్యేలా చేస్తున్నాయి. ఫలితంగా డీహైడ్రేషన్​కు గురవుతాం. అయితే డీహైడ్రేషన్​ను నివారించే యోగా ఆసనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో చూద్దాం. (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 10:34 AM IST

Yoga For Hydration : వేసవి కాలంలో డీ హైడ్రేషన్​ సమస్యకు చెక్​ పెట్టే యోగాసనాల కోసం తెలుసుకుందాం. (ANI)
ప్రాణాయామం శరీరానికి కలిగే అసౌకర్యాన్ని, వేడిని తగ్గిస్తుంది. అంతేకాక నాడీ వ్యవస్థ పనితీరుపై మెరుగైన ప్రభావం చూపుతుంది. (ANI)
త్రికోణాశనం, పాదహస్తాసనం, భుజంగాసనం, శవాసనం ప్రయత్నించండి. ఇవి జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. (ANI)
ప్రాణాయామం శరీరాన్ని లోపలి నుంచి చల్లబరచడానికి ప్రత్యేకంగా పని చేస్తుంది. నాలికను గొట్టంలా మడిచి నోటి ద్వారా, లోతైన శ్వాస తీసుకొని తరువాత ఆ గాలిని ముక్కు రంధ్రాల ద్వారా బయటకు వదలాలి. (ANI)
యోగా చేసిన తర్వాత తగినంత నీరు త్రాగాలి, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవాలి. (ANI)
యోగా చేసిన తర్వాత తగినంత నీరు తీసుకుని శరీరానికి విశాంత్రిని ఇవ్వాలి. అప్పుడే వేడి వాతావరణంలో చల్లగా, ప్రశాంతంగా ఉండొచ్చు. (ANI)

ABOUT THE AUTHOR

...view details