తెలంగాణ

telangana

ETV Bharat / photos

బరువు తగ్గించే వెజ్ జ్యూస్​లు- పోషకాలు మెండు- శరీరానికి మేలు!

Weight Loss Vegetable Juice : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఆరోగ్యవంతమైన శరీరాన్నే. దాని కోసం వాకింగ్, జాగింగ్ లాంటి శారీరక శ్రమతో పాటు రకరకాలైన ఆహారాలు తీసుకుంటారు. అయితే ఎక్కువగా శ్రమ పడకుండా, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారా? అదెలా అంటారా అయితే ఈ స్టోరీ చదవండి.

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 11:13 AM IST

Weight Loss Vegetable Juice : వెజిటబుల్ జ్యూస్​ల వల్ల హెల్త్​కు చాలా మంచిది. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హెల్తీ వెజ్ జూస్ రెసిపీలు మీకోసం.
1.క్యారెట్ జ్యూస్: క్యారెట్​లలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ఈ జ్యూస్​లో అల్లంను యాడ్ చేసుకోవచ్చు.
2.సొరకాయ రసం: సొరకాయలో విటమిన్ A,B, C లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు తగ్గటంలో సహాయకారిగా ఉంటుంది.
3.బీట్​రూట్ రసం: బీట్​రూట్​లో విటమిన్, మినరల్స్, ఫోలేట్, నైట్రేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని తాగటం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
4.పాలకూర రసం: పాలకూర మనం ఇంట్లో తరచుగా వండే కూరలలో ఇది ఒకటి. ఇందులో మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.
5.కాకరకాయ రసం: కాకరకాయ జ్యూస్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details