తెలంగాణ

telangana

ETV Bharat / photos

అయోధ్యలో వాటర్ మెట్రో- సూపర్​ ఫీచర్లతో సరయూలో జర్నీ!

Water Metro In Ayodhya : అయోధ్యలో పర్యటక అభివృద్ధి, రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు కేంద్రం సహకారంతో ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం కృషిచేస్తుంది. అయోధ్యలోని సరయూ నదిపై 'వాటర్​ మెట్రోను' అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అయోధ్యలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల స్థానికంగా ఉన్న ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కార్మికశాఖ సహాయమంత్రి రాజ్​భర్ చెప్పారు.

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 8:09 PM IST

రామనగరి అయోధ్యలో పర్యటకరంగాన్ని ప్రొత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సరయూ నదిపై వాటర్​ మెట్రోను నడపనున్నారు.
అయోధ్యలోని సంత్ తులసీదాస్ ఘాట్​ నుంచి గుప్తర్​ ఘాట్ వరకు సుమారు 14 కిలోమీటర్ల మార్గంలో వాటర్​ మెట్రో నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అమోదం తెలిపింది.
ఈ వాటర్ మెట్రోలో 50 మంది ప్రయాణికులు ఏకకాలంలో వెళ్లేవిధంగా దీనిని తీర్చిదిద్దారు. మెట్రోలో పూర్తిగా ఎయిర్​ కండీషనింగ్ ఏర్పాటు చేశారు. దీనివల్ల వేసవి కాలంలో చల్లగా ఉంటుంది.
వాటర్ మెట్రోలో ఛార్జింగ్ కోసం పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు నది ఒడ్డున సరయూ జెట్టీని ఏర్పాటు చేసింది. దీని నిర్వహణ బాధ్యతను రాష్ట్రప్రభుత్వం చూస్తోంది.
దీంతో పాటు అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఉపయోగపడేందుకు వీలుగా లైఫ్ జాకెట్లును, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచినట్లుగా అధికారులు వెల్లడించారు

ABOUT THE AUTHOR

...view details