Summer Foods For Hydration : సమ్మర్‌లో ఎండ తాపం నుంచి తప్పించుకోవడానికి. కూల్‌గా. హైడ్రేటెడ్‌గా ఉండడానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే.. కీర దోసకాయ వేసవి వేడిని ఎదుర్కోవడానికి అద్భుతమైన మార్గం. కీర దోసకాయలో ఏ. సీ. కే విటమిన్లు ఉంటాయి. ముక్కలు చేసిన కీర దోసకాయలను సలాడ్‌లలో కలుపుకొని తినొచ్చు.. పుచ్చకాయలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ. పొటాషియం కూడా దీని ద్వారా మన శరీరానికి లభిస్తాయి. పుచ్చకాయ తింటే శరీరానికి చలువ లభిస్తుంది. బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహణలో ఇది సహాయపడుతుంది.. కొబ్బరి నీరులో పొటాషియం. మెగ్నీషియం. కాల్షియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. సహజ నీటి వనరు. ఎలక్ట్రోలైట్‌లను పునరుద్ధరించడానికి. వేడిని ఎదుర్కోవడానికి తరచూ కొబ్బరి నీరు తాగాలి.. పనసపండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు. పీచుపదార్థాలు. పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే చర్మ సమస్యలు. హైబీపీ నుంచి ఉపశమనం లభిస్తుంది.. వేసవిలో శాకాహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాకరకాయ. గుమ్మడికాయ. టమాటాలు. పొట్లకాయ వంటి కూరగాయలు తింటే శరీరానికి చలువదనం లభిస్తుంది. తగిన పోషకాలు అందుతాయి. దోసకాయలు. బీన్స్. స్క్వాష్. బెర్రీలు కూడా తినడం మంచిది.