తెలంగాణ

telangana

ETV Bharat / photos

షుగర్​ లెవెల్​ మేనేజ్​ చేసే సమ్మర్​ డ్రింక్స్- ఇంట్లోనే చేసుకోండిలా - SUMMER DRINKS at home - SUMMER DRINKS AT HOME

Summer Drinks To Manage Sugar Level : వేసవిలో మంచినీరు ఎంతగా తాగినా దప్పిక తీరదు. కొంతమంది పదేపదే కూల్‌డ్రింక్‌లు తాగుతారు. వీటికన్నా ఎండ నుంచి ఇన్​స్టంట్​ రిలీఫ్​ ఇచ్చే షర్బత్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు​. వీటి వల్ల బ్లడ్ షుగర్​ లెవెల్​ను కూడా కంట్రోల్​ ఉంచుకోవచ్చు. ఆలాంటి సమ్మర్​ డ్రింక్​లు ఇంటివద్దే చిటికెలో తయారు చేసుకోండిలా.

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 4:16 PM IST

Summer Drinks To Manage Sugar Level : ఇంట్లోనే చిటికెలో తయారుచేసుకునే వేసవి డ్రింక్​లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమిషాల్లో రెడీ అయ్యే సింపుల్ సమ్మర్​ డ్రింక్​​ నమ్​కీన్​ లస్సీ. పెరుగు, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, పుదీనా ఆకులు బాగా మిక్స్​ చేసి సర్వ్​ చేయండి అంతే.
ఇంట్లో ఇట్టే చేసుకునే డ్రింక్​ కీరా పుదీనా జ్యూస్​. నిమ్మరసం, పుదీనా ఆకులు, తాజా కీరాను బాగా కలపాలి. అనంతరం ఫ్రిజ్​లో కాసేపు ఉంచి కూల్​గా తాగేయొచ్చు.
శరీరానికి పుష్కలంగా మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు అందించే డ్రింక్​ లీఫీ వెజిటెబుల్ జ్యూస్​. బచ్చలికూర, కీరా, గ్రీన్ యాపిల్, అల్లం, నిమ్మరసం అన్ని కలిపి జ్యూస్​ చేసి సెర్వ్​ చేయండి.
బాదం పాలతో చేసే ఐస్​ కాఫీ మీ శరీరంలో కెఫిన్​ స్థాయిలను పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్​ ఇన్​టేక్​ను తగ్గిస్తుంది.
తులసి, బ్లూబెర్రీ, నిమ్మరసం కలిపి చేసే మరో సమ్మర్​ డ్రింక్​ బసిల్ బ్లూబెర్రీ లెమనేడ్. బ్లూబెర్రీలో డైటరీ ఫైబర్​ , తక్కువ గ్లైసెమిక్​ ఇండెక్స్​ ఉంటుంది. ఇది గ్లూకోజ్​ అబ్జార్ప్షన్​ను తగ్గిస్తుంది.
మరో డెలిషియస్ సమ్మర్ డ్రింక్​ బెల్​ షర్బత్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, ఫోలేట్, విటమిన్స్, మినెరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details