తెలంగాణ

telangana

ETV Bharat / photos

స్పెషల్ 'రామా బ్లూ' చీరలో నిర్మల- వరుసగా ఆరుసార్లు బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డ్​ - Union Budget

Nirmala Sitharaman Budget Sarees : పార్లమెంటులో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ సమం చేశారు. అయితే, గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు. మరోవైపు బడ్జెట్​తో పాటు నిర్మలాసీతారామన్​ చీరలు సైతం అప్పటినుంచి ప్రత్యేకంగానే నిలుస్తున్నాయి. 2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు చేనేత చీరే ధరిస్తున్నారు.

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:00 PM IST

కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టే రోజు ప్రభుత్వం కురిపించే వరాల జల్లు లాగే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ ధరించే చీరపైనే అంతే దృష్టి ఉంటుంది.
ఈ ఏడాది బడ్జెట్ ట్యాబ్‌ పట్టుకొని నీలంరంగు చీరలో కనిపించారు నిర్మల.
ఈ టస్సర్ పట్టు చేనేత చీర గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది.
ఈ నీలివర్ణాన్ని తమిళనాడులో రామా బ్లూ అని పిలుస్తారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరను ధరించారు.
మొత్తంగా అటు బెంగాల్‌, ఇటు తమిళనాడు సంప్రదాయాలను కలగలిపిన చీరతో ఆమె మరోసారి ప్రత్యేకతను చాటుకున్నారు.
2023లో బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
2022లో ఒడిశాకు చెందిన చేనేత మెరూన్‌ రంగు చీరను ధరించారు నిర్మల. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు.
2021లో గోధుమ-ఎరుపు రంగు కలగలిసిన తెలంగాణకు చెందిన భూదాన్‌ పోచంపల్లి చీరలో మెరిశారు.
2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో కనిపించారు.
ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్‌ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details