తెలంగాణ

telangana

ETV Bharat / photos

లెబనాన్​పై ఇజ్రాయెల్ డెడ్లీ అటాక్స్- ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జనం పరుగులు - israel lebanon war

Israel Lebanon War Photos : లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుండటం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తుండటం వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న నగరాలకు పారిపోతున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్‌ వెళ్లే దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు ఎక్కడ ఆహారం దొరికినా ముందుగానే కొనుక్కుంటున్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 7:24 PM IST

రెండు రోజులుగా లెబనాన్​పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 558కి చేరింది. ఇందులో 50మంది పిల్లలు, 94మంది మహిళలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. (Associated Press)
ఈ దాడుల్లో ఇప్పటివరకు గాయపడిన 1835 మందిని 54 ఆస్పత్రులకు చేర్చినట్లు తెలిపింది. (Associated Press)
ఇదిలా ఉండగా- ఇజ్రాయెల్, లెబనాన్​ యుద్ధం భీకరంగా మారుతోంది. (Associated Press)
వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుడుతుంటే రాకెట్లతో హెజ్‌బొల్లా ప్రతిదాడులు చేస్తోంది. (Associated Press)
ఈ యుద్ధంలో లెబనాన్‌తో పాటు ఇజ్రాయెల్‌ నగరాల్లోనూ పలు భవనాలు దెబ్బతిన్నాయి. (Associated Press)
అకస్మాత్తుగా వచ్చిపడిన యుద్ధంతో అనేక మంది లెబనాన్‌ పౌరులు నిరాశ్రయులయ్యారు. దిక్కుతోచని స్థితిలో సిరియాకు వలసపోతున్నారు. (Associated Press)
ప్రస్తుతం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు గాజా యుద్ధం తొలి రోజులను గుర్తుకు తెస్తోంది. గతేడాది గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ప్రారంభించిన సమయంలో లక్షలాది మంది పాలస్తీనా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. (Associated Press)
ఇప్పుడు లెబనాన్‌లోనూ అదే తరహా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సోమవారం భీకరస్థాయిలో విరుచుకుపడటమే అందుకు కారణం. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. (Associated Press)
ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్‌ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. (Associated Press)
వేలాది మంది ప్రాణాలు చేతపట్టుకుని ఉత్తర దిక్కునున్న నగరాలకు పారిపోతున్నారు. (Associated Press)
లెబనాన్ రాజధాని బీరుట్‌కు వెళ్లే దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దక్షిణ ఓడరేవు నగరం సిడాన్ నుంచి బీరుట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి కార్లతో నిండిపోయింది. (Associated Press)
ఎక్కడ ఆహారం దొరికినా ప్రజలు ముందుగానే కొనుక్కుంటున్నారు. ఫార్మసీలు, బేకరీల వద్ద రద్దీ కనిపిస్తోంది. గ్యాస్ స్టేషన్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. (Associated Press)
మరోవైపు హెజ్‌బొల్లాపై విస్తృతంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. దక్షిణ, తూర్పు లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలకు సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని మెసేజ్‌లు, వాయిస్‌ రికార్డింగ్‌లతో హెచ్చరించింది. (Associated Press)
ఈ హెచ్చరికలతో వాహనాలు లేని వారు సామాన్లతో సహా కాలినడకనే సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. వలసదారుల కోసం బీరుట్‌, ట్రిపోలి, తూర్పు లెబనాన్‌లోని పాఠశాలల్లో ఆశ్రయం ఏర్పాటు చేస్తున్నారు. (Associated Press)
దక్షిణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు బీరుట్ సహా ఉత్తర ప్రాంతాలకు వస్తున్నారని అధికారులు తెలిపారు. (Associated Press)
బాంబు దాడితో కమ్ముకున్న పొగ (Associated Press)
బాంబు దాడితో కమ్ముకున్న పొగ (Associated Press)
లెబనాన్​లో దెబ్బదిన్న భవనాలు (Associated Press)
మంటలను ఆర్పివేస్తున్న ఫైర్ సిబ్బంది (Associated Press)
యుద్ధం కారణంగా నిరాశ్రయులు అయిన లెబనాన్​ వాసులు (Associated Press)
సహాయక కేంద్రాల్లో చిన్నారులతో లెబనాన్​ వాసులు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details