Floods In Sahara Desert : ఎడారిలో చుక్క నీరు లభించడమే గగనం. అలాంటిది ఏకంగా అక్కడ వరదలొస్తే ఎలా ఉంటుంది. ఆశ్చర్యపోతున్నారా? ఈ వింత ఘటన ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారిలో జరిగింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు సహారా ఎడారిలో వరదలు సంభవించాయి. సూర్యుడి చుట్టూ భూమి తిరగటంలో తలెత్తే మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. (Associated Press)