ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

పింఛన్​ కోసం వృద్ధులు, వికలాంగుల కష్టాలు - సచివాలయాల వద్ద ఎదురుచూపులు - Beneficiaries Pension problems - BENEFICIARIES PENSION PROBLEMS

Beneficiaries Facing Problems Getting Pensions : రాష్ట్రంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు గ్రామ సచివాలయాల వద్ద పడి గాపులు కాస్తున్నారు. 4వ తేదీ వచ్చినా డబ్బులు పంపిణీ చేయట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకే సచివాలయాల వద్దకు వచ్చిన లబ్ధిదారులు మధ్యాహ్నమైనా డబ్బులు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 7:20 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి దగ్గర నుంచి ఎండలోనే వేలిముద్ర తీసుకుంటున్న సచివాలయ సిబ్బంది
ఇచ్ఛాపురంలో పింఛన్ల కోసం గ్రామ సచివాలయానికి వస్తూ లబ్ధిదారుల ఇబ్బందులు
సచివాలయాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇతరుల సహాయంతో ఎండలో అక్కడికి వచ్చిన వికలాంగుడు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పింఛన్​ కోసం సచివాలయానికి వచ్చిన వికలాంగులు
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
అమలాపురంలో నెలవారి పింఛను సొమ్ము కోసం వచ్చిన లబ్ధిదారులు మధ్యాహ్నమైనా డబ్బులు ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు.
బ్యాంకులలో డబ్బులు లేవని రేపు రమ్మని లబ్ధిదారులకు చెప్పిన సచివాలయ సిబ్బంది
కోనసీమ ప్రాంతంలో పింఛను కోసం వికలాంగుడు సచివాలయానికి ఎండలో నడుచుకుంటూ వస్తున్న చిత్రం
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని సచివాలయంలో పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు అని తెలియగానే పదుల సంఖ్యలో వృద్ధులు సచివాలయాలకు పడుతూ లేస్తూ చేరుకున్నారు.
ఉండ్రాజవరంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు
పశ్చిమగోదావరి జిల్లా పింఛన్ల పంపిణీ ప్రారంభించారని తెలుసుకున్న వృద్ధులు పడుతూ లేస్తూ సచివాలయాలకు చేరుకున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గ్రామ సచివాలయం 1లో కార్యాలయం తలుపులు సగమే తీసి వృద్ధులను ఇబ్బందులకు గురి చేశారు.
వృద్ధులు సచివాలయం వద్దకు వెళ్తే మీ పేరు ఇక్కడ లేదు ఇంకో సచివాలయం దగ్గరికి వెళ్లాలని వారిని పంపించేస్తున్నారు
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని సచివాలయం 2లో 392 మంది లబ్ధిదారులకు రూ.11,84,500 నగదు ఇవ్వాల్సి ఉంది.
నగదు లేక పింఛన్​ కోసం వచ్చిన వృద్ధులను తిప్పించుకుంటున్న సచివాలయ సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details