Pratidhwani :పెళ్లి పంజరంలో బాల్యం బందీ అవుతోంది. 18 ఏళ్లు నిండకుండానే పెళ్లై, తల్లులు అవుతున్న చిన్నారి పెళ్లికూమార్తెల వ్యథలు కథలు కథలుగా కొనసాగుతునే ఉన్నాయి. ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నట్లు? చాపకింద నీరులా కొనసాగుతున్న చైల్డ్ మేరేజెస్. వారి విద్య, జీవన అవకాశాలు, ఆశలు చిదిమేసి, ఆరోగ్యం, హక్కుల్ని దెబ్బ తీస్తున్నా ఎందుకు పట్టడం లేదు? స్వయాన సుప్రీం కోర్టే ఆందోళన వ్యక్తం చేసిన అంశం ఇది.
కొద్దినెలల క్రితమే భారతీయ శిశు సంరక్షణ – ఐసీపీ పరిశోధక బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా దేశంలో ప్రతి ఒక్క నిమిషం ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిపీటలపై కూర్చుంటున్నారు . మరి ఈ దుస్థితి తప్పించలేమా? బాల్య వివాహాల్ని అడ్డుకోలేమా? ఆ ప్రయత్నంలో ప్రభుత్వం, పౌరసమాజం ఎవరి బాధ్యత ఎంత? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. బీ కీర్తి, తరుణి స్వచ్ఛందసంస్థ వ్యవస్థాపకులు ఏ. మమతా రఘువీర్ పాల్గొన్నారు.
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!
Supreme Court On Child Marriage :బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. బాల్యంలో వివాహం చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
"ఆపదలో ఆడపిల్ల" - తల్లి గర్భం నుంచి సమాజంలో నిత్య పోరాటం!
బాల్యవివాహాలను అరికట్టడం ఎలా ?దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది. బాల్య వివాహాలు మైనర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని నిర్దేశించింది.
బాలిక సాహసం.. బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు