ETV Bharat / state

తిరుమలలో ఆ 5 డ్యామ్‌లపై ప్రభుత్వం ఫోకస్ - నీటి నిల్వ 0.5 టీఎంసీలకు పెంపు! - GOVERNMENT CONTROL TIRUMALA DAMS

జలవనరుల శాఖ ఆధీనంలోకి తిరుమలలోని డ్యామ్‌లు - శ్రీవారి భక్తుల భవిష్యత్తు నీటి అవసరాలపై పరిశీలన

Government Focus On Safety Of Five Dams In Tirumala
Government Focus On Safety Of Five Dams In Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2024, 1:11 PM IST

Government Focus On Safety Of Five Dams In Tirumala : శేషాచలం కొండల్లో ఉన్న 5 డ్యామ్‌ల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో భక్తుల పెరుగుదలకు తగ్గట్టుగా నీటి అవసరాలు తీర్చేందుకు నిల్వ సామర్థ్యం ఎలా పెంచాలి అనే దానిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర జల సంఘం ఆదేశాల మేరకు ఈ 5 డ్యామ్‌ల భద్రతకు సంబంధించిన పనులు చేపట్టబోతున్నారు. తిరుమల కొండల్లో గోగర్భం, పాపవినాశనం, కుమారధార, ఆకాశ గంగ, పసుపు ధార డ్యామ్‌లు ఉన్నాయి. సంవత్సరాల తరబడి తిరుమల తిరుపతి దేవస్థానమే (టీటీడీ) వీటిని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వీటి నిర్వహణ, భద్రత బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జల వనరులశాఖకు అప్పగించనుంది.

కేంద్ర జలసంఘానికి చెందిన డ్యాం భద్రతా విభాగం డైరెక్టర్‌ సరబ్‌జిత్‌ భక్షి (Sarabjit Bakshi) వచ్చే ఏడాది మే నెలలో ఈ డ్యామ్‌లను సందర్శిస్తారు. అనంతరం వాటి భద్రతపై నివేదికను సమర్పించారు. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ వీటిని భారీ డ్యామ్‌లకు సంబంధించిన జాతీయ రిజిష్టర్‌లో ఇప్పటికే నమోదు చేసింది. ఫలితంగా ధర్మ పోర్టల్‌లో (Dam Health and Rehabilitation Monitoring Application)ఈ డ్యామ్‌ల సమాచారం ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో వీటిని జల వనరుల శాఖ ఆధీనంలోకి తీసుకురానున్నారు. ఇందుకు తిరుమలలో 2 సబ్‌ డివిజన్లను ఏర్పాటు చేయాలని జల వనరులశాఖ ప్రతిపాదన చేస్తోంది. డ్యామ్‌ల భద్రత, నీటి నిల్వ పెంపు పనులకు టీటీడీ నిధులు వెచ్చించే ఆస్కారం ఉంది. తాజాగా రాష్ట్ర డ్యామ్‌ల భద్రతా అధికారి, ఆకృతుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ రత్న కుమార్, తిరుపతి చీఫ్‌ ఇంజినీర్‌ ఎమ్​ మల్లికార్జున్‌ రెడ్డి, ఇతర అధికారులు తిరుమలలోని ఈ డ్యామ్‌లను పరిశీలించారు. వాటి ప్రస్తుత స్థితిగతులు, భద్రతపై ఒక నివేదిక సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.

తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణకు శ్రీకారం

నీటి నిల్వ 0.5 టీఎంసీలకు పెంపు! : తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం ప్రస్తుతం రోజూ సగటున ఎనభై వేల మంది భక్తులు వస్తుంటారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య దాదాపు 1,25,000కు చేరుతుందని అంచనా. తిరుమలలో ఇప్పుడు ఉన్న 5 జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 0.229 టీఎంసీలు. శ్రీవారి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వారి నీటి అవసరాలు తీర్చేందుకూ దృష్టి సారించాల్సి ఉంది. ఇందుకు ఇక్కడి జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నారు. ఇందుకు పసుపు ధార, కుమార ధార జలాశయాల్లో అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ విషయాన్ని ఒక ఏజెన్సీకి అప్పగించి అధ్యయనం చేయించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. మరో వైపు గాలేరు నగరి సుజల స్రవంతి పథకం (Galeru Nagari Sujala Sravanthi Scheme) రెండో దశ కింద బాలాజీ జలాశయం, మల్లె మడుగు జలాశయాలు నిర్మించే ప్రతిపాదన ఉంది. ఒక్కో జలాశయంలో ఒక్కో TMC నీటిని నిల్వ చేసే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం ఉన్న డ్యాంల సామర్థ్యం మేరకే మరో 0.25 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చని అధికారులు ఆలోచన చేస్తున్నారు. కుమారధారలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 898.240 మీటర్లు. ఇక్కడ గరిష్ఠంగా 900.24 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం టీటీడీ పూర్తి రిజర్వాయర్‌ స్థాయికే నీటిని నిల్వ చేస్తోంది. జల వనరుల శాఖ అధికారులు వీటిని తనిఖీ చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. పూర్తి నిల్వ సామర్థ్యానికి, గరిష్ఠంగా నీటిని నిల్వ చేసే సామర్థ్యానికీ మధ్య రెండు మీటర్ల తేడా ఉంది. మరో ఒక మీటరు ఎత్తుకు నీటిని నిల్వ చేసినా మరో 0.25 TMCలను నిల్వ చేసే అవకాశం ఉంది. ఇందుకు గేట్లు ఎత్తు కొంత మేర పెంచితే సరిపోతుంది. కొంత లీకేజీ సమస్యలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సి ఉంది. పైగా ఇక్కడ నీటిని ఎత్తిపోసేలా 5 దశల ఎత్తిపోతల పథకం ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఎప్పుడో నిర్మించింది ఉంది. ఇక్కడి నుంచి నీటిని సరఫరా చేయడం సులభమేనని అంటున్నారు. అన్ని వివరాలతో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపి జలవనరుల శాఖ చర్యలు తీసుకోనుంది.

శ్రీవారి దర్శనానికి ఎన్నెన్ని దారులో - సర్వదర్శనం నుంచి స్లాటెడ్‌ బుకింగ్‌ వరకు మీకోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.