Voter List Has A Mistake of Errors : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార నేతలు ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ భారీగా దొంగ, డబుల్ ఓట్లు నమోదు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితాను పరిశీలించినా తప్పులే కనిపిస్తున్నాయి. గతంలో గుర్తించిన తప్పులను సరి చేయాలని ఆయా పార్టీల ప్రతినిధులు ఎన్నికలు అధికారులు దృష్టికి తీసుకుపోయిన వాాటి పట్టించుకున్న దాఖలాలు లేవు.
కొత్త ఓటర్ల జాబితాలోనూ కుప్పలు తెప్పలుగా అవే పాత తప్పులు!
Anantapur District : ముసాయిదా జాబితాను పరిశీలించి తుది జాబితా-2024 తయారు చేయడానికి ఎంత గడువిచ్చినా ఫలితం కనిపించడం లేదు. ఇంకా చిత్ర విచిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓటరు జాబితాల్లో లోపాలు పుట్టగా మారాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 125 పోలింగ్ కేంద్రంలో మొత్తం 724 ఓట్లు ఉన్నాయి. అందులో స్థానికంగా ఉన్నవారి ఓట్లు తొలగించి, పెళ్లిళ్లు అయి శాశ్వతంగా పట్టణం నుంచి వెళ్లిపోయిన వారి ఓట్లను మాత్రం పదిలంగా ఉంచారు. స్థానిక పోలింగ్ కేంద్రంలోని ఓటరు జాబితా వరుస సంఖ్య 303, 304లో యువకుడు కుమ్మర హరికృష్ణ పేరుతో రెండు ఓట్లు కల్పించారు. అదే కేంద్రంలో వరుస సంఖ్య 111 లో కొలిమి శాషివా భాను ఓటుకు సంబంధించిన చిత్రంలో ఆమె ఫొటో స్థానంలో పురుఘని ఫొటో ఉంది. ఇలాంటి తప్పులు ఆ జాబితాలో మరిన్ని కనిపిస్తున్నాయి. వాటిని సరి చేయాలని ఉన్నతాధికారులకు తాము ప్రతిపాదించామని బీఎల్ఓలు చెబుతున్నా ఎలాంటి మార్పు జరగలేదు.