ఇప్పుడే మండుతున్న ఎండలు - భగభగల వెనక అసలు కారణాలేంటి? - TEMPERATURE INCREASING IN TELANGANA
ఏటా మార్చి - ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు - ఈసారి ఫిబ్రవరి మొదటి వారం దాటక ముందే సెగలు - ఇప్పటికే అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డు
![ఇప్పుడే మండుతున్న ఎండలు - భగభగల వెనక అసలు కారణాలేంటి? Temperature Increasing in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/1200-675-23492529-thumbnail-16x9-pd.jpg)
Published : Feb 7, 2025, 2:12 PM IST
Temperature Increasing in Telangana :ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. మరి 2025 ఏం చేయబోతోంది అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ భగభగల వెనక అసలు కారణాలేంటి? ముందస్తు సెగలపై వాతారణ విభాగం, పర్యావరణ నిపుణులు ఏమంటున్నారు?