Social Worker Agitation at Municipal Office in Palnadu District : పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద 18వ వార్డు సామాజిక కార్యకర్త బొగ్గరం మూర్తి ఆందోళన చేపట్టారు. నరసరావుపేట 19వ వార్డులోని ఎన్‌ఎంసీ పబ్లిక్ టాయిలెట్స్ని కబ్జా చేసిన వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా కార్యాలయం ఎదుట మూర్తి బైఠాయించి శిరోముండనం చేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడేందుకు యత్నించినందుకు తనపై శుక్రవారం వెంకటరెడ్డి హత్యాయత్నం చేశాడని ఆరోపించారు. వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు తిరిగి అతన్ని వదిలిపెట్టడం దారుణమన్నారు. వెంకటరెడ్డిపై వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి: బహుజన టీచర్ల సంఘం
బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం :పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని రోడ్డు ప్రక్కన 19వ వార్డు సచివాలయ భవనాన్ని ( బీసీ సామాజిక భవనం ) ఆధునికరీస్తున్నారు. దీని ఎదుట పట్టణ వైసీపీ నేత వెంకటరెడ్డికి ( మిలటరీ రెడ్డి) చెందిన వాణిజ్య భవన సముదాయం ఉంది. దీని పక్కన ప్రభుత్వ పోరంబోకు ఖాళీ స్థలాన్ని ఆక్రమించి ఆయన గతంలోనే మరుగుదొడ్డి నిర్మించారు. ప్రస్తుతం అది సచివాలయం కోసం ఏర్పాటు చేసిన దారికి అడ్డుగా మారింది. దీన్ని తొలగించాలని పురపాలక సంఘం, సచివాలయ సిబ్బంది ఆయనకు పలుమార్లు సూచించారు. అధికార పలుకుబడితో వారి చర్యలను అడ్డుకున్నారు. సామాజిక కార్యకర్త, 18వ వార్డు వైసీపీ నేత బొగ్గురం మూర్తిని స్థానికులు ఆశ్రయించారు. ఆయన ప్రోత్సాహంతో స్థానికులు జిల్లా స్పందన కార్యక్రమంలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.