Pratidwani : అశేషాంధ్రులూ వైఎస్సార్సీపీకి కనీసం ప్రతిపక్షహోదా కూడా లేని స్థితికి తెచ్చి కూటమికి అధికారం ఇచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ప్రతిరోజూ ప్రభుత్వానికి బురద పూయటం వైఎస్సార్సీపీ తంతు. దానిని కడుక్కోవటం చంద్రబాబు సర్కార్ వంతుగా మారింది. తన సొంత మీడియాలో, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వదులుతూ ప్రజల్లో అపోహాలు సృష్టించే ప్రయత్నంలో జగన్ పరివారం బిజీబిజీగా ఉంది. భూతాన్ని సిసాలో బంధించి, బిరడా బిగించి నేలలో పాతేసినట్టుగా ప్రజలు తీర్పిచ్చినా ఆ పార్టీ అభూత కల్పనలు ఆగట్లేదు. 2024 ఎన్నికల్లో నడ్డి విరగ్గొట్టే ఫలితాలు ఎందుకు వచ్చాయి? శిఖరాగ్రం నుంచి పాతాళానికి ఎందుకు పడిపోయాం? అనే ఆత్మ పరిశీలన వైఎస్సార్సీపీ చేసుకుంటోందా? ఈ అంశాల గురించి నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
ఉత్తరాంధ్రను వీడిన వైఎస్సార్సీపీ గ్రహణం- కూటమి రాకతో అభివృద్ధిపై ఆశలు - Pratidwani on Uttarandhra
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బండకేసి బాదినట్టుగా తీర్పు ఇచ్చారు. దాని నుంచి ఆ పార్టీ ఏవైనా గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను వేధించిన నాటి వైఎస్సార్సీపీ నాయకులను, అధికారులను చంద్రబాబు ప్రభుత్వం ఉపేక్షిస్తోందని గట్టి చర్యలు తీసుకోవట్లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. జగన్ మాత్రం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారు? గతంలో తమకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలను జగన్ ప్రశంసించి, ఇప్పుడు చిత్తుగా ఓడిపోతే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సెక్యూరిటీ మొత్తం తీసేశారని జగన్ కోర్టుకు వెళ్లటం, రాష్ట్ర ప్రభుత్వం మీద రోజుకో ఆరోపణలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి పట్ల తమ ప్రభుత్వం చట్ట పరంగానే వ్యవహరిస్తుంది తప్ప కక్షసాధింపులకు దిగదని చెబుతున్నారు. అయితే దానికి తగినట్టుగా టఫ్‌గా ఉండట్లేదు అనే ఆవేదన కూటమికి ఓటేసిన వారిలో కనిపిస్తోంది.