Pratidwani: పెట్టుబడులు ఆకర్షించిన నవ్యాంధ్రను పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అవకాశాల స్వర్గంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మార్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో ఎవరు ముందుకు వచ్చినా ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామనీ ప్రకటించారు. మరి ఇదే విషయంలో, పరిశ్రమలను ఆహ్వానించే చొరవలో సూర్యోదయ రాష్ట్రంలో ఐదేళ్లుగా ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకోవాలన్నా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు మెరుగైన అవకాశాలు ఏర్పడాలన్నా ఇప్పుడేం చేయాలి? ఆ దిశగా ప్రభుత్వం ఏం ఆశిస్తోంది. పరిశ్రమ వర్గాలు ఏం కోరుకుంటున్నాయి? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే బ్రాండ్ ఏపీని తిరిగి బలంగా పున:నిర్మించే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విషయంలో రాష్ట్రం ఎక్కడుంది? అయిదేళ్లుగా ఏం జరిగింది? పారిశ్రామికంగా నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న అనుకూలతలు ఏమిటి. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, ఇక్కడ పారిశ్రామిక ప్రగతికి ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి? ఉన్న అవకాశాలను ఉపయోగించుకోకపోవడం వల్ల అయిదేళ్లుగా బ్రాండ్ ఏపీ, ఇక్కడి యువత, వృత్తి నిపుణులకు జరిగిన నష్టం ఏమిటి? మరీ ముఖ్యంగా ప్రాంతాలు, రంగాల వారీగా తీసుకుంటే ఏ ప్రాంతంలో, ఏ ఏ పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయి.
తిరుమల పవిత్రత పునరుద్ధరణకు ప్రభుత్వం ఏం చేయనుంది? - Prathidwani on TTD Irregularities