ETV Bharat / state

అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నోటీసులు - చిక్కడపల్లి పీఎస్‌లో హాజరైన హీరో - POLICE ISSUES NOTICE TO ALLU ARJUN

కిమ్స్‌కు అల్లు అర్జున్‌ వస్తారన్న సమాచారంతో పోలీసుల నోటీసులు - ఏదైనా జరిగితే అల్లు అర్జున్‌ బాధ్యత వహించాల్సి వస్తుందన్న పోలీసులు

POLICE ISSUES NOTICE TO ALLU ARJUN
POLICE ISSUES NOTICE TO ALLU ARJUN (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2025, 10:07 AM IST

Updated : Jan 5, 2025, 11:15 AM IST

Ramgopalpet Police Issues Notice To Hero Allu Arjun : సినీనటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడిని పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్‌ వస్తారనే సమాచారంలో పోలీసులు ఈ నోటీసులను జారీ చేశారు. పరామర్శకు వస్తే తమ సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్‌ బాధ్యత వహించాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

మరోవైపు చిక్కడపల్లి పోలీసుస్టేషన్​కు అల్లు అర్జున్ వెళ్లారు. సంధ్య థియేటర్ కేసులో బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ప్రతి ఆదివారం పీఎస్‌ ముందు హాజరుకావాలని ఆదేశాాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను జనవరి 3వ తేదీ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని నాంపల్లి కోర్టు ఆదేశాలలో పేర్కొంది. ఈ క్రమంలో చిక్కడపల్లి పీఎస్‌లో హజరై సంతకం చేసి అల్లు అర్జన వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.

అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నోటీసులు (ETV Bharat)

'అల్లు ఆర్మీ, అభిమానుల పేరుతో వందల కాల్స్‌ - చంపేస్తామని బెదిరింపులు'

ఇదీ జరిగింది: 'పుష్ప 2’ మూవీ ప్రీమియర్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అనే విధంగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో అల్లు అర్జున్‌ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్‌ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాదులు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది.

Allu Arjun Reaction : ఈ ఘటనపై అల్లు అర్జున్​ సైతం పలుమార్లు స్పందించారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్‌ కొద్ది దూరంలో కారు ఆగిపోవడంతో, ముందుకు కదల్లేని పరిస్థితిలో చేయి చూపిస్తూ ముందుకు కదలండని అన్నానని చెప్పుకొచ్చారు.

సమస్యలు చాలా ఉన్నాయి : అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్‌ స్పందన

'రేవతి చనిపోయిందని థియేటర్​లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్

Last Updated : Jan 5, 2025, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.