Pratidhwani On How Indian Rupee Value Fall Compared To Us Dollar : రూపాయి భయపెడుతోంది. డాలర్‌తో దాని మారకవిలువ ఆందోళన కలిగిస్తోంది. అదిగో ఇదిగో అంటునే 86 రూపాయలు దాటేసింది. అసలు ఎందుకీ పతనం? రూపాయి పతనం దేశీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? ఇదేదో ఆర్థిక రంగానికి సంబంధించిన వారికే కాదు ప్రతిఒక్కరు దృష్టి పెట్టాల్సిన విషయం. సగటు ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎంతకాలం? రూపాయి ఎప్పటికి కోలుకుంటుంది? అంతలోపు విదేశీవిద్య మొదలు అమెరికా, ప్రపంచ దేశాలపై ఆధారపడి చేసే ఖర్చుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గడం కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రతికూలమేనా? రూపాయిని కాపాడుకోవడం కేంద్రప్రభుత్వం ముందున్న మార్గమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1. వీవీకే ప్రసాద్ (వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, హైదరాబాద్) 2. ప్రొ. చిట్టెడి కృష్ణారెడ్డి (హెచ్‌సీయూ ఆర్థికశాస్త్ర విభాగం, హైదరాబాద్)
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓ వైపు రూపాయి విలువ పడిపోతుంటే మరోవైపు డాలర్ బలపడుతొందని తెలిపారు. కొంతకాలంగా ఆందోళన కలిగిస్తోన్న రూపాయి విలువ, ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే జీవితకాల కనిష్ఠ పతనానికి చేరిందన్నారు. చూస్తుండగానే మారక విలువ 86 రూపాయలు దాటేసిందన్నారు. అసలు రూపాయి ఈ స్థాయిలో ఎందుకు పతనమవుతోందని అందరిలో ప్రధాన చర్చగా ఉందన్నారు. ఈ రూపాయి క్షీణత అనేది దేశంలోని అనేకరంగాలపై ప్రభావం చూపిస్తోందని తెలిపారు. 2024 డిసెంబర్‌లో డాలర్‌తో పోలీస్తే రుపాయి మారక విలువ రూ.85 ఉంది. అయితే 2024 మొత్తం మీద రూపాయి విలువ 3% వరకు క్షీణించిందని తెలిపారు.
'కొత్త బడ్జెట్ - కోటి ఆశలు' - ఆ వేతనజీవుడికి ఇప్పుడైనా ఉపశమనం దొరికేనా?