విధాననిర్ణయాల్లో ఉల్లంఘనలను చట్టం, కోర్టులు అంగీకరిస్తాయా? - MISTAKES IN POLICY DECISIONS
మంత్రులకు బాధ్యత ఎంత? బాసుల బాధ్యత ఎంత? - ఒత్తిడి చేయడం వల్లనే చేశామంటే కుదురుతుందా?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2025, 12:44 PM IST
Who is Responsible For Mistakes in Policy Decisions : మంత్రి చెబితే చేశాను! సీఎం అడిగితే కాదనలేక పోయాను! నా మీద పై నుంచి ఒత్తిడుల వల్లే సంతకం చేయాల్సి వచ్చింది. ఇలాంటి స్టేట్‌మెంట్లు తరచు వింటూ ఉంటాం. ఏదైనా స్కామ్ జరిగినప్పుడు, కోర్టులు పిలిచి IAS, IPSలను చీవాట్లు పెట్టినప్పుడు ఇటువంటి ప్రకటనలు తరచు చూస్తూ ఉంటాం. ప్రభుత్వ పరిభాషలో ప్రోసీజర్ ల్యాప్స్ అంటారు. అచ్చ తెలుగులో చెప్పాలంటే విధానపరమైన నిర్ణయాల్లో ఉల్లంఘనలు అనుకోవచ్చు. ప్రజాధనానికి, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు ఉన్నప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది ఆయా మంత్రులా? లేదా ఆయా శాఖల అధికారులా? తప్పిదాల్లో ఎవరి పాత్ర ఎంత? వాటికి చట్టపరమైన శిక్షలు ఎలా ఉంటాయి? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్గొంటున్న వారు 1) పద్మనాభరెడ్డి (సుపరిపాలన వేదిక, హైదరాబాద్) 2) ముప్పాళ్ల సుబ్బారావు (సీనియర్ న్యాయవాది, రాజమహేంద్రవరం)