Pratidhwani on RBI Cuts Repo Rate :వడ్డీరేట్లపై ఊపిరి బిగబట్టి చూస్తున్న వారందరికీ ఎట్టకేలకు ఊరట కలిగించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐదేళ్లుగా పెంచడం తప్ప తగ్గించడం జోలికి పోని ఆర్బీఐ మొదటిసారి కీలక వడ్డీరేట్లలో కోత పెట్టింది. ద్రవ్య విధాన నిర్ణాయక సంఘం రెపో రేట్‌ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతంగా ప్రకటించింది. గడిచిన 11 సమావేశాల్లో ఆ ఊసెత్తని ఎంపీసీ ప్రస్తుత నిర్ణయానికి కారణమేంటి?
ఇటీవలే బడ్జెట్‌లో వేతన, మధ్యతరగతి జీవుల ఆశలకు ఊతమిస్తూ ఆదాయ పన్ను విషయంలో తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీరేట్ల విషయంలో పెద్ద మనసు చేసుకుంది. దీని ఫలితంగా వచ్చే మార్పులు ఏమిటి? ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిజానికి ఐదేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు 11 ఎంపీసీ సమావేశాలు జరిగాయి. మరి ఇప్పుడే ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? రెపో రేట్‌లో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు ప్రభావంతో రుణాలు తీసుకున్నవారి వాయిదాల మొత్తం, రుణాల కాలపరిమితితో పాటు రుణాల అర్హతలో ఎలాంటి మార్పు వస్తుంది?
RBI Monetary Policy Meeting Decisions :ఇటీవలే బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపన్ను ఊరట అంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించింది. ఈ రెండు కలిపి చూస్తే కలిగే మేలు ఏమిటి? వడ్డీరేట్లు తగ్గించాలి అన్న నిర్ణయాన్ని 5-1 ఆధిక్యంతో ఆమోదించింది ఎంపీసీ. దీనిని బట్టి చూస్తే రానున్న రోజుల్లో మరిన్ని కోతలకు అవకాశం ఉందనుకోవచ్చా? మరో కీలక విషయం కూడా చెప్పింది ఆర్బీఐ. ఆర్థిక సర్వే 6.4 శాతం ఉండొచ్చన్న ఈ ఏడాది దేశం వృద్ధిరేటు 7.2 శాతం వరకు రావొచ్చంది. అందుకున్న అవకాశాలు ఏమిటి?