ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

వంశీ సరే?- ప్రజాకంటక నేతాసురులపై చర్యలెప్పుడు? - PRATHIDWANI ON VAMSI ARRESTED

జగన్ పాలనలో ప్రజాపీడకులెందరో- దువ్వాడ, తోపుదుర్తిలాంటి కంటకులకు కటకటాలెప్పుడు?

prathidwani
prathidwani (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 10:44 AM IST

Prathidwani :ఎట్టకేలకు వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ అండతో ఆ పార్టీ అధికారంలో ఉండగా చెలరేగి ప్రజలను, ప్రజాసంఘాలను, ప్రతిపక్షాలను పీడించిన అనేకమంది వైఎస్సార్సీపీ నాయకుల్లో వంశీ ఒకరు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి, మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై రాళ్లదాడి, గుడివాడలో పబ్లిక్‌గా పేకాట క్లబ్బులు, క్యాసినోవాలు, కర్నూలులో ఈనాడు కార్యాలయంపై కర్రలతో దాడి, అనంతపురం జిల్లాలో జర్నలిస్టులపై భౌతికదాడులు ఇలా చెప్పుకుంటూ పోతూంటే జగన్ సర్కార్ హయాంలో అకృత్యాలు ఎన్నో.

శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ నుంచి, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు తోపుదుర్తి సోదరుల వరకు కేసుల్లోని, అక్రమాలు, అన్యాయాలు చేయని వైఎస్సార్సీపీ నేతలు ఎవరున్నారు? వారి అందరిపై చర్యలు ఎప్పుడు? లోకకళ్యాణం కోసం లోక కంటకులను కటకటాలకు నెట్టేదెన్నడు? ఇవీ సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నలు. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం. చర్చలో పాల్గొంటున్నవారు సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి సురేష్, సామాజిక కార్యకర్త పి.వినీల.

ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన చేసిన అకృత్యాలు ఏంటి? ఇంతకాలం ఎందుకు పట్టింది అరెస్ట్ చేయటానికి? సీఎం చంద్రబాబు మా ప్రభుత్వం ఎవరిపైనా కక్షసాధించదు అని చెబుతున్నారు. లేని కేసుల్లో ఇరికిస్తే అది కక్షసాధించటం అవుతుంది. కానీ ఇప్పటికే అనేక కేసుల్లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవటం కక్షసాధింపు ఎలా అవుతుంది? ఆ విషయంలో ఇంకొంత వేగంగా ప్రభుత్వం పనిచేయాలని కేడర్ కోరుతున్నారా?ఒకసారి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను గుర్తుకు తెచ్చుకుని చెప్పండి. గత ఐదేళ్లలో ఎవరెవరు ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారు?

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీ అరెస్టు
సీఎంగా జగన్ అండదండలతో గత ఐదేళ్లలో ప్రతిపక్ష నాయకులను ఎక్కడెక్కడ ఎలా వేధించారు? ఎంపీ రఘురామకృష్ణంరాజును లాకప్‌లో ఎలా చిత్రహింసలకు గురిచేశారు? స్థానిక ఎన్నికల్లో అయితే ప్రతిపక్ష పార్టీలను చితకబాది నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. పోటీ చేస్తున్నవారిని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు దౌర్జన్యాలు చేశారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించారు? ఆ కేసులు అన్నీ ఏమయ్యాయి?

ఈ రోజు రెవిన్యూ సదస్సులు ఎక్కడ జరిగినా అందులో బాధితులు బారులు తీరుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు తమ భూములను కబ్జా చేశారని గగ్గోలు పెడుతున్నారు. వారందరిపై కేసులు వేగవంతం కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఓ కాకాణీ, ఓ కారుమూరి, ఓ కొడాలి నానీ, ద్వారంపూడి, పెద్దిరెడ్డి ఇలా ఎందరో కేసుల్లో ఉన్నవారు ఉన్నారు. వాళ్లు జైలులో ఉంటే హమ్మయ్య అని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే వారు ఎందరో ఉన్నారు. వారి విషయంలో చట్టం తన పని తాను ఎప్పడు చేసుకుని వెళుతుంది అని ఆశించవచ్చు?

ఆర్​జీవీ, శ్రీరెడ్డి లాంటి వాళ్లతో సహా అనేక మంది వైఎస్సార్సీపీ వారు సోషల్ మీడియాలో చాలా అసభ్యంగా ప్రచారం చేశారు. వారి విషయంలో ఎలాంటి చర్యలు అవసరం? అనే అంశాల గురించిన పూర్తి సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

తన కోసం కష్టపడిన వారిపైనే అక్రమ కేసులు - ఐదేళ్లలో వంశీ అరాచకాలు ఇవీ!

ABOUT THE AUTHOR

...view details