Prathidwani :ఇచ్చినమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతల తీసుకుంటునే రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఆశలకు అండగా నిలుస్తూ మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేశారు చంద్రబాబు. గడిచిన అయిదేళ్ల వైఎస్సార్సీపీ ఏలుబడి నిరుద్యోగ యువతకు చేసిన గాయాలకు లేపనంగా వస్తునే 16వేల 347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటనకు లైన్ క్లియర్ చేశారు. డిసెంబర్‌లోపుగా ఆ ప్రక్రియ కూడా పూర్తి కావాలని నిర్దేశించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా యువత నైపుణ్య గణన కోసం ఉద్ధేశించిన మరో కీలకమైన దస్త్రంపైనా అయిదవ సంతకం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ రెండు నిర్ణయాల ద్వారా రాష్ట్ర యువతకు కొత్తప్రభుత్వం ఇస్తోన్న సంకేతాలు, సందేశాలు ఏమిటి? ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన లక్షలమంది పట్టభద్రులు ఇప్పుడేం అనుకుంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిఖీ, ప్రముఖవిద్యావేత్త, పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు పాల్గొన్నారు.
Unemployed Youth Thank you To CM Chandrababu Naidu :మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేశారు. అన్ని రకాల పోస్టులు కలిపి 16,347 భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఉపాధ్యాయుడు కావాలన్న తమ కల నెరవేరే రోజు ఇచ్చినందుకు ధ్యాంక్యూ సీఎం సర్ అంటూ ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చంద్రబాబు సరికొత్త రికార్డు - తాజా ప్రకటనతో 2,32,179కు చేరిన సంఖ్య - Chandrababu Filling Teacher Posts
థాంక్యూ సీఎం సార్ : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెట్టడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ళుగా టీచర్ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ సీఎం సార్ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ కొనియాడారు. 117 జీవో రద్దు చేసి ఎస్జీటీ పోస్టులు పెంచితే తమకు మరింత మేలు చేసిన వారవుతారని నిరుద్యోగులు కోరుతున్నారు.
నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం : మెగా డీఎస్సీ పై మొదటి సంతకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టడంతో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త మార్కెట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ చిత్రపటాలకి పాలాభిషేకం తెలుగు యువత చేశారు. మెగా డీఎస్సీ ప తొలి సంతకం చేసిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువత అధ్యక్షుడు మొక్కల శ్రీనివాసరావు మాట్లాడుతూ 16 వేలు మెగా డీఎస్సీ వదలటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు.
'మా కలనెరవేరుస్తున్నందుకు థాంక్యూ సార్'- మెగా డీఎస్సీపై రాష్ట్ర వ్యాప్త సంబరాలు - MEGA DSC in ap