Prathidwani on AP Capital Amaravati Development : రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మాత్రమే కాదు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది అత్యంత కీలకం. అమరావతి అనే మహానగరం నిర్మితమైతే పక్కనే ఉన్న హైదరాబాద్‌లాగా రాష్ట్రాన్ని పోషించేది. ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. మహా వృక్షంలా ఎందరికో ఉపాధినీ కల్పించేది. అలాంటి కీలకమైన రాష్ట్ర రాజధానిని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వందల కోట్ల రూపాయాలతో నిర్మించిన అనేక నిర్మాణాలను ధ్వంసం చేసింది. మూలన పడేసింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఆ పాలనను సమూలంగా తుడిచి పెట్టేశారు. అభివృద్ధికి పట్టం కట్టారు. ఐదేళ్ల చెరవీడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అవతరించాలంటే ఏం చేయాలి? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్యలో పాల్గొన్న వారు అమరావతిపై పుస్తక రచయిత కందుల రమేష్ , ఆర్థిక, సామాజిక విశ్లేషకులు డా. ఎస్.అనంత్.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జగన్ విధ్వంసాన్ని అంచనా వేయాలనే ఉద్దేశం రాజధానిలో పర్యటించారు. తొలుత జగన్ కక్షగట్టి కూల్చేయించిన ప్రజావేదికను పరిశీలించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నష్టం, విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమన్నారు.