ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?

Prathidwani Debate on YSRCP Ministers Performance: వైసీపీ పాలన పూర్తికావొస్తోంది. మరి సీఎం జగన్, ఆయన మంత్రుల పని తీరు ఎలా ఉంది? సీఎం జగన్ నేతృత్వంలో వివిధ శాఖల పనితీరు ఎలా ఉంది? సీఎం, మిగిలిన మంత్రులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు? వంటి పలు విషయాలను ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Prathidwani_Debate_on_YSRCP_Ministers_Performance
Prathidwani_Debate_on_YSRCP_Ministers_Performance

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 1:12 PM IST

Prathidwani Debate on YSRCP Ministers Performance: రాష్ట్రంలో పాలనకి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలోని మంత్రివర్గం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి, వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేది వారే. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ఆయా శాఖల పనితీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు ఎంత సమర్థంగా పనిచేస్తున్నారు? తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయా శాఖల అధికారులకు, పాలనా యంత్రాంగానికి ఏం దిశానిర్ధేశం చేస్తున్నారు? రాష్ట్ర మంత్రిగా వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా పాలన చేయాలి. అందరినీ సమానంగా చూడాలి. ఎటువంటి కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా పరిపాలన చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో సీఎం జగన్ ప్రతీకార భావజాలంతో పరిపాలన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చారు. రాజధాని అమరావతిపై కక్ష సాధింపు వైఖరి ప్రదర్శించారు. జగన్​కి ఒక విజన్ అంటూ ఏమీ లేదు. ప్రతిపక్షాలపైన, రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడులు చేస్తున్నారు. కోర్టులపైనా, న్యాయమూర్తులపైనా వ్యాఖ్యలు చేశారు. ఒక విజనరీ ముఖ్యమంత్రి ఎలా ఉంటారో గతంలో చంద్రబాబు నాయడుని చూశామని సీనియర్ పాత్రికేయులు కె.సురేష్‌ తెలిపారు.

నదీజలాలు వృథాగా సముద్రంలోకి - సీఎం జగన్‌, నీటిపారుదల మంత్రికి ఆ స్ఫృహ ఉందా?

సీఎం తర్వాత కేబినెట్‌లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్‌ ఏంటో రాష్ట్రమంతా తెలుసు. గతంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఇప్పుడు విద్యుత్, అటవీశాఖల మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలోకి ఎవరినీ రానీయకుండా తన అడ్డాగా మార్చుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్న వ్యక్తి అటవీశాఖ మంత్రిగా పనిచేయడం ప్రజలను ఆలోచింపజేసే విషయం. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఇప్పటికే పెద్దిరెడ్డిపై పుస్తకాలు సైతం వేశాయని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే సైతం గతంలో విమర్శించారు. ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని అని రాజకీయ విశ్లేషకులు డి.వి.శ్రీనివాస్ ప్రశ్నించారు.

సీనియర్ మోస్ట్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ పరంగా, పార్టీలోనూ ఆయనకు ఎదురులేదు. మూడేళ్లు మున్సిపల్‌ మంత్రి, రెండేళ్లు విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే విద్యాశాఖ మాత్రం రాష్ట్రంలో పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఉపాధ్యాయులు అంతా రోడ్లపైనే ఉన్నారు. వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బైజూస్ పేరుతో స్కామ్ చేశారని డి.వి.శ్రీనివాస్ తెలిపారు.

వీరే కాకుండా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రెవిన్యూమంత్రి ధర్మాన, ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇలాంటి మంత్రులు, ఇలాంటి నాయకుల చేతిలో రాష్ట్రాన్ని మరోసారి పెడితే ఏం జరుగుతుంది? అనే దానిపై ప్రతిధ్వనిలో చర్చించారు.

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?

ABOUT THE AUTHOR

...view details